Prabhas Marriage: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బాహుబలి (Bahubali)తో యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ప్రభాస్.. ఆ తర్వాత చేసిన ‘సలార్’ (Salar), ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమాలతో గ్లోబల్ స్టార్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అయితే ప్రభాస్ ఎన్ని హిట్స్ కొట్టినా.. ఆయన ఫ్యాన్స్ ను ఓ బాధ వెంటాడుతూనే ఉంటుంది. అది ఏంటంటే ప్రభాస్ పెళ్లి విషయం. తమ హీరో పెళ్లి కోసం డార్లింగ్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చక్కర్లు కొడుతున్న ఓ గాసిప్.. ఫ్యాన్స్ ను ఎగిరి గంతేసేలా చేస్తోంది.
అనుష్క పేరెంట్స్ తో ప్రభాస్ మీట్
సిల్వర్ స్క్రీన్ పై ఎవర్ గ్రీన్ కపుల్స్ లో ప్రభాస్ – అనుష్క జంట ముందు వరుసలో ఉంటుంది. వారిద్దరి ఈడు – జోడు అదరహో అంటూ ఫ్యాన్స్ మురిసి పోతుంటారు. ఈ క్రమంలో తాజాగా ప్రభాస్ – అనుష్క కు సంబంధించి టాలీవుడ్ లో ఓ బజ్ వినిపిస్తోంది. అనుష్క తల్లిదండ్రులతో ప్రభాస్ భేటి అయినట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి. అయితే మీటింగ్ గురించి ఎక్కడ బయటకు పొక్కకుండా ప్రభాస్ సీక్రెట్ మెయిన్ టెన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఎందుకీ సీక్రెట్ మీట్!
ప్రస్తుతం ప్రభాస్, అనుష్క ఏ ప్రాజెక్ట్ లో నటించడం లేదు. అయినప్పటికీ ఆమె తల్లిదండ్రులను ప్రభాస్ కలిసినట్లు వార్తలు రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే గత కొన్ని రోజులుగా పెళ్లి విషయమై అనుష్కను ఆమె తల్లిదండ్రులు ఫోర్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభాస్ వారిని కలిసి నచ్చచెప్పే ప్రయత్నం చేశారని టాక్ వినిపిస్తోంది. తామిద్దరం కచ్చితంగా పెళ్లి చేసుకుంటామని, కొంచెం టైమ్ ఇవ్వాలని ప్రభాస్ సూచించినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది.
Also Read: Operation Sindoor: మాక్ డ్రిల్ అని చెప్పి.. పాక్ తాట తీశారు.. శభాష్ భారత్!
అనుష్క పేరెంట్స్ నో?
అయితే కూతురు పెళ్లి ఇప్పటికే ఆలస్యమైందని.. ఇకపై వెయిట్ చేయడం తమ వల్ల కాదని అనుష్క తల్లిదండ్రులు ప్రభాస్ కు తెగేసి చెప్పినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రభాస్ నిరాశగా వెనుదిరిగి వెళ్లిపోయినట్లు ఫిల్మ్ నగర్ లో చర్చ జరుగుతోంది. అయితే ఇందులో ఎంతవరకూ వాస్తవం ఉందన్న దానిపై ప్రభాస్ – అనుష్కలే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.