Damodar Rajanarsimha( image credit: swetcha reporter)
తెలంగాణ

Damodar Rajanarsimha: ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసేవల విస్తరణకు.. దామోదర్ రాజనర్సింహ దిశానిర్దేశం!

Damodar Rajanarsimha: వైద్యసేవల్లో దేశంలోనే అగ్రగామీగా నిలవాలని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఓపీ, ఐపీలతో పాటు సర్జరీలూ పెరగాలన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో అందించే వైద్యసేవలపై ప్రజలకు భరోసా కల్పించాలన్నారు. ప్రైవేట్ కు దీటుగా ప్రభుత్వాసుపత్రులలో మెరుగైన వైద్యసేవలను అందించాలని సూచించారు.  ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రుల పై నమ్మకం, విశ్వాసం పెరిగేలా మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యం తో బ్రాండింగ్ చేయాలన్నారు. రాష్ట్రంలోని 202 ప్రభుత్వ ఆసుపత్రులకు వేగంగా బ్రాండింగ్ చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఓపీ, ఐపీ, సర్జరీలను పెంచడంతోపాటు, సామాన్యులకు ప్రభుత్వ ఆసుపత్రులలో నాణ్యమైన , మెరుగైన వైద్య సేవలు అందిస్తారనే భరోసా కల్పించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజల అవసరాలకు ఆనుగుణంగా బెడ్ ల సామర్థ్యాన్ని పెంచడంతోపాటు, ఎక్విప్మెంట్ లను సమకూర్చడం, బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేయడం వంటివి చేయాలన్నారు.

 Also Read: Solar Pump Sets: పునరుత్పాదక ఇంధన రం!గం బలోపేతం.. కేంద్ర మంత్రి తో.. భట్టి విక్రమార్క భేటీ

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న బ్రాండింగ్ కార్యక్రమంలో భాగంగా ఎన్ ఎంసీ నిబంధనలకు అనుగుణంగా ఫైర్ సేఫ్టీ , ఎలక్ట్రికల్ సేఫ్టీ, డ్యూటీ రూమ్, సీసీటీవీల పర్యవేక్షణ, సెక్యూరిటీ అవుట్ పోస్టుల ఏర్పాటు, రెడ్ అలారం సిస్టం లను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు అవసరమైన సౌకర్యాలు కల్పనలో భాగంగా ఐపీ, ఓపీ విభాగాలకు వచ్చే పేషెంట్లకు టాయిలెట్ బ్లాక్ లను ఏర్పాటు చేయాలన్నారు.

ఆస్పత్రిలో స్ట్రక్చరల్ రిపేర్లు, వివిధ విభాగాలకు సంబంధించి ప్రత్యేక కౌంటర్లు, సైనేజ్ బోర్డులు, అంతర్గత రోడ్లు, కాంపౌండ్ వాల్ నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఆస్పత్రిలో క్యాంటీన్, మంచినీటి సౌకర్యం, పేషంటు వెంట వచ్చే అటెండర్ల సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించాలన్నారు . ఆసుపత్రులలో ప్రత్యేకంగా రిసెప్షన్ను, కామన్ ఏరియా, బయో మెడికల్ వేస్టేజీ , ల్యాండ్ స్కేపింగ్ లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

ఆస్పత్రులలో పరిపాలన విభాగాన్ని ఏర్పాటు చేసి కార్పొరేట్ ఆసుపత్రుల కు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల ను తీర్చిదిద్దాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.ఈ సమీక్షలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్ చోoగ్తూ, టీజీఎంఎస్ ఐడీసీ ఎండీ ఫణీంద్ర రెడ్డి, డీఎంఈ డాక్టర్ . నరేంద్ర కుమార్, టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, డాక్టర్ రవుఫ్​ తదితరులు పాల్గొన్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?