MP Chamala On KTR
Uncategorized, తెలంగాణ

Chamala Kiran: కేటీఆర్‌కు మైండ్ దొబ్బింది.. చామల షాకింగ్ కామెంట్స్

Chamala Kiran: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేటీఆర్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన మాటలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్‌కు మైండ్ దొబ్బింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేటీఆర్‌కు మెడ, కళ్ల నొప్పులు దెబ్బకు పోయాయి. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. సమ్మె చేయొద్దు.. రాష్ట్రము బాగు చేసుకుందామని సీఎం చెప్పారు. గతంలో 52 రోజులు సమ్మె చేస్తే కేసీఆర్ ఒక్కరోజు కూడా బయటికి రాలేదు. సమ్మె చేస్తున్న వారిని నానా బూతులు ఆనాడు తిట్టిండు. రేవంత్ రెడ్డిలా సౌమ్యంగా ఎప్పుడు చెప్పలేదు. ఆ రోజుల్లో సమ్మె చేస్తే ఉద్యోగ సంఘాల్లో శ్రీనివాస్ గౌడ్‌ను ఎమ్మెల్యే చేశారు. ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడకుండా చేశారు. మిగులు రాష్ట్రాన్ని ఇస్తే కేసీఆర్ రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారు. వాస్తవ పరిస్థితులు చెప్పే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చేశారు. ఎన్నడూ కేటీఆర్ ఊరికే లేరు. ప్రతి రోజూ తప్పుడు ప్రచారమే చేశారు. తెలంగాణలో బిల్లులు రావట్లేదు.. అవన్నీ ఆనాడు కేసిఆర్ పెట్టిపోయారు. మిగులు రాష్ట్రం ఇస్తే అప్పుల రాష్ట్రంగా మార్చారు. మీ హయాంలో దోచుకున్నదే కాకుండా.. మళ్ళీ వచ్చే వాళ్లు పరిపాలన చేయకుండా చేశారు. తెలంగాణ ప్రజలకు లెక్కలు తెలియవు అనుకుంటున్నావా కేటీఆర్? మీ హయాంలో ఒకటో తారీకు జీతాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? లక్షా 50 వేల కోట్లు ఇప్పటి వరకూ అప్పు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది. మిస్ వరల్డ్‌కు ఖర్చు రూ.250 కోట్లు కాదు.. కేవలం రూ.27 కోట్లే మాత్రమే. కేటీఆర్ దోపిడీలో భాగస్వామి. తప్పుడు లెక్కలు చెప్పడం భావ్యం కాదు. మీరు దోచుకున్నంత దేశంలో ఎవరూ దోచుకోలేదుఅని చామల కన్నెర్రజేశారు.

Read Also- KTR on CM Revanth: చేతకాకుంటే తప్పుకో.. దివాలా మాటలు వద్దు.. సీఎంపై కేటీఆర్ ధ్వజం

సిగ్గు, శరం లేదు!
కేటీఆర్‌కు సిగ్గు, శరం లేదు. కాళేశ్వరంలో ఓ అధికారి జైలుకు వెళ్ళాడు. మీరు చెబితేనే కరెక్ట్ అనేది దుర్మార్గపు ఆలోచన. కేటీఆర్.. నీ పగటి కలలు ఎప్పటికీ నెరవేరవు. రేపటికి రేపు సీఎం కుర్చీలో కేటీఆర్ కూర్చోలేడు. పేదలకు మూడు ఎకరాలు ఎందుకు ఇవ్వలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగోలేకున్నా సీఎం రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశారు. రుణమాఫీ చేసినందుకు రాహుల్ క్షమాపణ చెప్పాలా? మేనిఫెస్టో గురించి మాట్లాడే హక్కు కేటీఆర్‌కు లేనే లేదు. ఆర్టీసీ సమ్మె 52 రోజులు జరిగితే ఎందుకు మాట్లాడలేదు? రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఇల్లు పార్కింగ్ లేక ఇబ్బంది పడుతున్నారు. కేటీఆర్ చెప్పిన 2వేల ఎకరాలు తీసుకురావాలి.. ఆ 2వేల ఎకరాలు సంగతేంటో బయటపెట్టాలి. కేటీఆర్ పిట్ట కథలు చెబుతుండు. చెల్లిని పార్టీ నుంచి బయటకు పంపాలి. బావను రాజకీయాల్లో కీలకంగా ఉండకుండా పడుకోబెట్టాలని కేటీఆర్ చూస్తున్నాడు. సీఎం ప్రజల సమస్యలు పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ చెప్పిందే చెప్పి వన్ మ్యాన్ షో చేసిండు. దెబ్బ తాకి మైండ్ దొబ్బి మాట్లాడిన కేటీఆర్ మాటలు రాష్ట్ర ప్రజలు నమ్మొద్దు. ఆర్టీసీ కార్మికులు, సచివాలయ ఉద్యోగుల బకాయిలు ప్రభుత్వం నెరవేర్చుతుందిఅని చామల స్పష్టం చేశారు.

Read Also- Simhachalam Incident : సింహాచలం ఘటనపై సర్కార్ సంచలన నిర్ణయం.. సీఎం తీవ్ర అసంతృప్తి

కేటీఆర్‌కు సీత‌క్క చుర‌క‌లు..
సీఎం రేవంత్ రెడ్డిపై అనవసర వ్యాఖ్యలతో కేటీఆర్ త‌న అస‌హ‌నాన్ని ప్రద‌ర్శిస్తున్నారని మంత్రి సీతక్క చురకలు అంటించారు. గ‌త ప్రభుత్వం కొన్ని వర్గాలకే కొమ్ముకాసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. కేసీఆర్ చేసిన అప్పు.. తెలంగాణ భ‌విష్యత్తుకు ముప్పుగా దాపురించింది. కేసీఆర్ నిర్వాకం వ‌ల్ల నెల‌కు రూ.6వేల కోట్ల ప్రజాధ‌నాన్ని అప్పల చెల్లింపుల కోసం మళ్లించాల్సి వ‌స్తోంది. స‌త్తా ఉన్న నాయ‌కుడు కేసీఆర్ అయితే ప‌త్తా లేకుండా ఎక్కడికి వెళ్లారు? స‌త్తా ఉంటే అసెంబ్లీకి వ‌చ్చి నిరూపించుకోవాలి. ఉద్యోగుల పోరాటాన్ని వాడుకున్న చ‌రిత్ర బీఆర్ఎస్‌ది. 40 మంది ఆర్టీసీ కార్మికుల ఉసురు తీసింది మీరు కాదా? ఉపాద్యాయ‌, ఉద్యోగ నాయ‌కుల ఇంటి త‌లుపులు ప‌గుల గొట్టింది ఎవ‌రు కేటీఆర్? ఎంద‌రో ఉద్యమ‌కారుల‌ను అవ‌మానించి బ‌య‌ట‌కు పంపిన చ‌రిత్ర మీది. అప్పులు, అమ్మకాలు త‌ప్ప మీరు చేసిన‌ అభివృద్ది శూన్యం. మీరు చేసిన అభివృద్ది ఒక గాలి బుడ‌గ అని ఎన్నిక‌ల్లో ప్రజ‌లే తేల్చారు. మీ అప్పుల మూలంగా ఎన్నో ఆర్దిక ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. అయినా ఎక్కడా సంక్షేమానికి లోటు లేకుండా చూస్తున్నాంఅని సీతక్క తేల్చి చెప్పారు.

Seethakka On KTR
Seethakka On KTR

Read Also-AP Tourism: సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ అదిరిపోయిందిగా!

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?