AP Sainik Schools( image credit: twitter)
తెలంగాణ

AP Sainik Schools: ఏపీ సైనిక్ స్కూళ్లలో తెలంగాణ విద్యార్థులకు.. లోకల్ కోటా కొనసాగించాలి.. మెదక్ ఎంపీ!

AP Sainik Schools: ఆంధ్రప్రదేశ్ సైనిక్ స్కూళ్లలో ఉన్న తెలంగాణ విద్యార్థులను తొలగించవద్దని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కోరారు. ఏపీ సైనిక్ స్కూళ్లలో 67 శాతం లోకల్ కోటాలో తెలంగాణ విద్యార్థులను తొలగించడం వల్ల వేలాది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ తో మెదక్ ఎంపీ రఘునందన్ రావు  ఫోన్ లో మాట్లాడారు. తెలంగాణలో సైనిక్ స్కూల్స్ ప్రారంభమయ్యే వరకు తెలంగాణ విద్యార్థులకు ఆంధ్రాలో లోకల్ కోటా ఉంచాలని విజ్ఞప్తిచేశారు.

కాగా మంగళవారం కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ ను తాను కలవబోతున్నట్లు రఘునందన్ రావు పేర్కొన్నారు. అప్పటివరకు తల్లిదండ్రులు సంయమనం తో ఉండాలని విజ్ఞప్తిచేశారు.

 Also Read: Bandi Sanjay on TG CM: తెలంగాణ పరువు తీశారు.. సీఎం వ్యాఖ్యలు దుర్మార్గం.. బండి ఫైర్

ఇదిలా ఉండగా మెదక్ లో జాతీయ రహదారుల కోసం కేంద్రం మంత్రి గడ్కరీకి ఎంపీ రఘునందన్ రావు వినతి పత్రం అందించారు. జాతీయ రహదారి 65లో పటాన్ చెరు గెస్ట్ హౌస్ నుంచి నొవపన్ చౌరస్తా వరకు ఒక ఫ్లై ఓవర్, ఇస్నాపూర్ చౌరస్తా వద్ద మరో ఫ్లై ఓవర్ నిర్మాణం అవసరమని విజ్ఞప్తిచేశారు.

అలాగే గుమ్మడిదల నుంచి నర్సాపూర్ మీదుగా మెదక్ వరకు నాలుగు వరుసల రహదారి నిర్మించాలని, మెదక్ నుంచి సిద్దిపేట మీదుగా ఎల్కతుర్తి వరకు నాలుగు లైన్ల రహదారి, అలాగే చేగుంట నుంచి జిల్లెళ్ళ క్రాస్ రోడ్ నుంచి భూంపల్లి వరకు మూడు జాతీయ రహదారులను కలిపే రహదారినిని జాతీయ రహదారిగా ప్రకటించి అభివృద్ధి చేయాలని రఘునందన్ రావు కేంద్ర మంత్రిని కోరారు.

అంతేకాకుండా మాంబోజీపల్లె నుంచి పాపన్నపేట, అల్లాదుర్గ్, వట్ పల్లి మీదుగా మెటల్ కుంట వరకు మెదక్-బీదర్ జాతీయ రహదారిని కలిపే ఈ మార్గాన్ని సైతం జాతీయ రహదారిగా ప్రకటించాలని కోరారు. కాగా దీనిపై గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ రఘునందన్ రావు తెలిపారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!