Alekhya – MLC Kavitha: టాలీవుడ్ కు చెందిన దిగ్గజ కుటుంబాల్లో నందమూరి ఫ్యామిలీ (Nandamuri Family) ముందు వరుసలో ఉంటుంది. అటు రాజకీయంగా, ఇండస్ట్రీ పరంగా తెలుగు రాష్ట్రాలపై ఆ ఫ్యామిలీ చెరగని ముద్ర వేసింది. ఇదిలా ఉంటే రెండేళ్ల క్రితం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. నటుడు నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna) అకస్మిక మరణం ఆ ఫ్యామిలీని విషాదంలో ముంచెత్తింది. తారకరత్నకు భార్య అలేఖ్య రెడ్డి (Alekhya Reddy), ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా అలేఖ్య ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.
అది ఏంటంటే?
తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన మహిళా నేతల్లో కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఒకరు. అయితే కవిత గురించి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి.. ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. కవితతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఇప్పటివరకూ ఎవరికీ తెలియని సీక్రెట్ ను రివీల్ చేశారు. కవితకు తనకు మధ్య 20 ఏళ్ల స్నేహం ఉందని అలేఖ్య చెప్పిన మాటలు ప్రస్తుతం రాజకీయంగా, ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారాయి.
‘అగ్నిలో నడిచాము’
కవితతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ అలేఖ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ 20ఏళ్ల స్నేహం ఇప్పటికీ కొనసాగుతున్నట్లు ఆమె చెప్పారు. ‘మనం తుఫానులను ఎదుర్కొన్నాం.. అగ్నిలో నడిచాం.. అసాధ్యమైన వాటిని సైతం ఫేస్ చేశాం. ప్రతీ సవాలుతో బలంగా నిలబడ్డాం. మనం ప్రతిరోజు మాట్లాడుకోకపోయినా ఒకరికోసం ఒకరు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాము. ఇలాంటి బంధం ఇంకా బలంగా.. అందంగా వృద్ధి చెందుతూనే ఉండాలి’ అంటూ కవితను ఉద్దేశిస్తూ అలేఖ్య రాసుకొచ్చారు.
కాలేజీ నుంచే స్నేహం?
తారకరత్న భార్య చేసిన పోస్ట్.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో వీరిద్దరికి స్నేహం ఎలా కుదిరిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 20 ఏళ్ల స్నేహం అంటున్నారు కాబట్టి.. కాలేజీ రోజుల నుంచే కవిత, అలేఖ్య మంచి స్నేహితులు అయి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా వీరి స్నేహం కలకాలం ఇలాగే ఉండాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.