Hero Nani ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Hero Nani: ఆ ఒక్క రాత్రి చాలా భయమేసింది.. రక్తంతో నా బాడీ తడిసిపోయింది.. హీరో నాని

Hero Nani: నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఒక నటుడిగా, ప్రొడ్యూసర్‌గా దూసుకెళ్తున్నాడు.ఈ నేపథ్యంలోనే నిర్మాతగా కోర్ట్‌ చిత్రంతో బ్లాక్ బ‌స్టర్ కొట్టాడు. ఇక హీరోగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూ పాపులారిటీ పెంచుకుంటున్నాడు. దసరా చిత్రంతో మొదలైన తన సక్సెస్ ట్రాక్.. హాయ్ నాన్న, సరిపోదా శనివారం, హిట్ 3తో ఇప్పటికీ అదే ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన హిట్ 3 మూవీ థియేటర్స్ లో ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో నాని వైలెంట్ గా కనిపించి అందర్ని మెప్పించాడు. అయితే, ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ నిజాలు చెప్పాడు.

Also Read:  CPI Narayana On Nagarjuna: హీరో నాగార్జునపై సీపీఐ నేత సంచలన ఆరోపణలు.. బాబోయ్ మరీ ఈ స్థాయిలోనా!

అయితే, తన నిజ జీవితంలో జరిగిన ఓ రోడ్ యాక్సిడెంట్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. నేను, నా ఫ్రెండ్ కలిసి బయటకు వెళ్లినప్పుడు రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిపాడు. ఖాళీగా ఉన్న రోజు నా ఫ్రెండ్ కార్ తీసుకొని సరదాగా అందరం కలిసి అలా బయటకు వెళ్ళాము. అయితే, రోడ్డుపై ఆగి ఉన్న లారీని మా కారు వేగంగా వచ్చి గుద్దేసింది. చీకటి పడటంతో అసలు ఏం కనిపించలేదు. లారీ ఉందని చూసుకుని పెద్ద యాక్సిడెంట్ జరిగింది. నా జీవితంలోనే ఇలాంటి యాక్సిడెంట్ చూడలేదు. ఒకేసారి గట్టిగా తగలడంతో ఒక్క దెబ్బకి ముందున్న గ్లాస్ పగిలిపోయింది. మాకు ఒళ్లంతా గుచ్చుకుంది. నా శరీరం మొత్తం రక్తంతో తడిసిపోయింది.

Also Read:  Minister Punnam Prabhakar: ములుగు ప్రజల దశాబ్దాల కల నెరవేరింది.. మంత్రి పొన్నం ప్రభాకర్!

నా పక్క సీట్లో నా ఫ్రెండ్ స్పృహలో లేడు. ఎలాగలో బయట పడ్డాము. చివరికి మమ్మల్ని హాస్పిటల్ చేర్చారు. ఇదిలా ఉండగా.. మేము వెళ్లే దారిలో ఇంకో ప్రమాదం జరిగింది. పెళ్లి వాహనానికి పెద్ద యాక్సిడెంట్ జరిగింది. వారికి కొందరికి గాయాలయ్యాయి. వారిలో, ఓ చిన్న పాప కూడా ఉంది. ఆ చిన్న పాపను బాధను చూసి భయం వేసింది..భరించలేకపోయా.. నాకు ప్రమాదం జరిగిందన్న విషయం కూడా మర్చిపోయి.. ఆ పాపకు ఎలా ఉందో అని ఐసీయూ ముందు అలానే బయట నిలుచుని ఉండిపోయా.. ఆ రాత్రిని నేను జీవితంలో మర్చిపోను. నా లైఫ్‌ను పూర్తిగా మార్చేసిందని చెప్పాడు. ప్రస్తుతం, నాని చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?