Sritej: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను కిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించిన విషయం తెలిసిందే. రిహాబిలిటేషన్ కేంద్రంలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న శ్రీతేజ్‌ను సోమవారం ఉదయం నిర్మాత అల్లు అరవింద్, మరో నిర్మాత బన్నీ వాసుతో కలిసి పరామర్శించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ వీడియోలో శ్రీతేజ్ కోలుకున్నట్లుగా కనిపిస్తున్నాడు. శ్రీతేజ్‌ని పరామర్శించి, అతని ఆరోగ్య పరిస్థితి ఏంటనేది డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు నిర్మాత అల్లు అరవింద్.
Also Read- Thammudu: నితిన్ ‘తమ్ముడు’ రిలీజ్ డేట్ ఫిక్స్.. భలే ప్రకటించారుగా!
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం శ్రీతేజ్ కోలుకుంటున్నాడని, ఇంతకు ముందు కంటే చాలా బెటర్‌గా ఆ పిల్లాడి ఆరోగ్య పరిస్థితి ఉందని తెలిపారు. త్వరలోనే శ్రీతేజ్ నార్మల్ స్థితికి చేరుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. శ్రీతేజ్ కుటుంబానికి హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, మైత్రీ నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచలి రవిశంకర్ ఆర్థికంగా సహాయం చేసిన విషయం తెలిసిందే.
#AlluAravind garu and @TheBunnyVas garu visited to Sritej who recently shifted to Asian Transcare Rehabilitation Centre.
With all the love & blessings, the little boy is doing absolutely fine. pic.twitter.com/OJm9X04t9h
— Balu Kondapalli (@Balu2070) May 5, 2025
శ్రీతేజ్ హాస్పిటల్‌లో ఉన్నప్పటి నుంచి అతని యోగ క్షేమాలను అల్లు అర్జున్, అల్లు అరవింద్, బన్నీ వాసు ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటూనే ఉన్నారు. శ్రీతేజ్ హాస్పిటల్ ఖర్చులతో పాటు, అతని పేరున కొంత ఫిక్స్‌డ్ అమౌంట్ కూడా జమ చేసిన విషయం తెలిసిందే. శ్రీతేజ్ మళ్లీ ఎప్పటిలానే నార్మల్ స్థితికి వచ్చి, అందరితో కలిసి స్కూల్‌కు వెళ్లే వరకు, అలాగే భవిష్యత్‌లో అతనికి ఏ అవసరం వచ్చినా అతనికి, అతని ఫ్యామిలీకి అండగా ఉండేందుకు అల్లు అర్జున్ సైతం కమిటై ఉన్నారు.
Also Read- Heroine: పరేష్ రావలే కాదు.. ఈ హీరోయిన్ కూడా సొంత యూరిన్ సేవించిందట!
కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స మొదలు, ప్రస్తుతం రిహాబిలిటేషన్ సెంటర్‌లో ట్రీట్‌మెంట్ వరకు శ్రీతేజ్ ఆరోగ్యపరిస్థితిని ఎప్పటికప్పుడు అల్లు అరవింద్, బన్నీ వాసులను పంపించి అల్లు అర్జున్ తెలుసుకుంటూనే ఉన్నారు.
అసలేం జరిగిందంటే:
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా ప్రీమియర్ నిమిత్తం సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయాడు. ఆ ఘటన తర్వాత కేసులు నమోదవడం, అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం, బెయిల్‌పై బయటకు రావడం వంటి విషయాలన్నీ అందరికీ తెలిసినవే. ఈ ఘటనలో శ్రీతేజ్ ఫ్యామిలీకి రూ. 2 కోట్ల ఆర్థిక సాయాన్ని హీరో, దర్శకుడు, నిర్మాతలు అందజేశారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు