Weather Updates: తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శాఖ తెలిపింది.రాష్ట్రంలొని కొన్ని ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. దీంతో ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
వర్షాలకు విద్యుత్ కోతలు రహదారిల పైకి వరద నీరు రావడం లాంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నందున, అధికారులు మున్సిపల్ యంత్రాంగాన్ని అధికీరులు అప్రమత్తం చేశారు. తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో రాగల మరో మూడు రోజుల వరకు పడతాయని స్సష్టంచేసింది. ఈ సందర్భంగా కొన్ని వాతావరణ హెచ్చరికలు చేసింది. వర్షాలు పడే అవకాశం ఉండడంతో ప్రజలతోపాటు రైతులు అప్రమత్తంగా ఉండాలని పిడుగులు పడే ప్రమాదం ఉండడంతో చెట్ల కింద ఉండరాదని సూచించింది. సిద్దిపేట, అమీన్ పూర్ లో ఆదురు గాలులతో పాటు సంగారెడ్డి ప్రాంతంలో రాళ్ల వర్షం కురిసింది.
Also Read: GHMC Revenue: ఎర్లీ బర్డ్ దూకుడు .. గత ఏడాదితో పోల్చితే ఈసారి ఎక్కువే!
ఏపీలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీనికి తోడు భారీ ఈదురు గాలులు వీయడంతో పలు ప్రాంతాల్లో భారీ చెట్లు కుప్పకూలాయి. కోస్తా ఆంధ్రాలోని అల్లూరి, విశాఖ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గాలివానకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు కూడా వీస్తాయని, ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది.
Also Read: Man Hulchul Hyderabad: పోలీస్ బాస్ ఫోన్ నెంబర్ తో వ్యక్తి హల్చల్.. కేసు నమోదు!