JVAS Re Release
ఎంటర్‌టైన్మెంట్

JVAS: రూ. 6-50 టికెట్ బ్లాక్‌లో రూ. 210.. ఇది చిరంజీవి స్టామినా!

JVAS: మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోగానీ, తెలుగు సినిమా ఇండస్ట్రీలోగానీ, ఎప్పటికీ నిలిచిపోయే ఓ క్లాసిక్ చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari). దాదాపు 35 సంవత్సరాల క్రితం విడుదలైన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. సినిమా విడుదలైన రోజు భారీ వర్షం. సినిమా బాక్స్‌లు కూడా థియేటర్లకు చేరుకోలేని పరిస్థితి. నిర్మాత దిగులులో ఉన్నారు. అప్పుడే మొదలైంది విధ్వంసం. తుఫాన్ కాస్త కలెక్షన్ల సునామీగా మారింది. నిర్మాత కళ్లల్లో ఆనందం.. ఇలా చెప్పుకుంటూ ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి, అప్పటి టికెట్ల ధర. అవును 9 మే, 1990న ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది.

Also Read- Thammudu: నితిన్ ‘తమ్ముడు’ రిలీజ్ డేట్ ఫిక్స్.. భలే ప్రకటించారుగా!

అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ చెరిపేసి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన ఈ సినిమా.. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఓ కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. ఈ సినిమా క్రేజ్‌ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. 6 రూపాయల 50 పైసలు ఉన్న టికెట్ ధర.. మొదటి మ్యాట్నీ షోకే బ్లాక్ మార్కెట్‌లో రూ. 210కు అమ్ముడయ్యాయి. అంటే దగ్గరదగ్గరగా 35 రెట్లు ఎక్కువన్నమాట. అది మెగాస్టార్ చిరంజీవి స్టామినా. ఇప్పుడిదంతా ఎందుకంటే.. ఈ క్లాసిక్ చిత్రాన్ని మళ్లీ ఆడియెన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. ఏ తేదీన ఈ సినిమా విడుదలయ్యిందో, అదే తేదీ మే 9న ఈ చిత్రాన్ని సరికొత్తగా ముస్తాబు చేసి రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలకొస్తే..

JVAS Records
JVAS Records

‘అబ్బ నీ తీయని దెబ్బ’ ఐకానిక్ పాట గురించి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మాట్లాడుతూ.. ‘‘ఈ పాటను ఒక రోజు కంటే తక్కువ టైమ్‌లో కంపోజ్ చేశామని తెలిస్తే అంతా ఆశ్చర్యపోతారు. ఇళయరాజా ఉదయం 9 గంటలకు ఆ పాటపై పని చేయడం ప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మాకు ట్యూన్ ఇచ్చారు. రాఘవేంద్రరావు, దత్, నాకు వెంటనే నచ్చింది. ఆ ట్యూన్ ఎంతో సరళంగా, తియ్యగా అనిపించింది. భోజన సమయంలో వేటూరి సాహిత్యం రాశారు. బాలు దానిని సరదాగా పాడారు’’ అని తెలిపారు. ‘అందాలలో’ అనే పాట గురించి దర్శకుడు కె. రాఘవేంద్రరావు చెబుతూ.. ‘కథ ప్రకారం హీరో ఒక సామాన్యుడు, హీరోయిన్ ఒక దేవత.. అని చెప్పాలి. ఆ విషయాన్ని పాట ద్వారా మాత్రమే తెలియజేయగలమని మేమంతా భావించాం. ఆ ఐకానిక్ పాటను కంపోజ్ చేయడం వెనుక ఉన్న ఆలోచన కూడా అదే’ అని అన్నారు.

Also Read- Babil Khan: ఏడుస్తూ.. బాలీవుడ్‌పై ఇర్పాన్‌ ఖాన్‌ తనయుడు షాకింగ్ కామెంట్స్

ఇక ఇందులోని ‘దినక్కుతా’ అనే పాట గురించి నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ.. ‘ఈ పాట షూట్ చేసే టైంకి చిరంజీవికి 106 డిగ్రీల జ్వరం. ప్రతి షాట్ బ్రేక్ సమయంలో, మేము ఆయన శరీరాన్ని ఐస్ ప్యాక్డ్ బట్టలతో చుట్టి చల్లపరుస్తూ వచ్చాం. శ్రీదేవి కాల్ షీట్లు మాకు చివరి రెండు రోజులు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత ఆమె మరో షూటింగ్ కోసం ఒకటిన్నర నెలలు విదేశాలకు వెళుతోంది. దీంతో మేము ఆ రెండు రోజుల్లోనే ఒకే సెట్‌లో షూటింగ్ పూర్తి చేయాల్సి వచ్చింది. అందుకే జ్వరంతోనూ చిరంజీవి ఆ పాట కోసం చాలా కష్టపడ్డారు. షూటింగ్ తర్వాత చిరంజీవిని వెంటనే విజయ ఆసుపత్రిలో చేర్పించాం. 15 రోజుల తర్వాత ఆయన డిశ్చార్జ్ అయ్యారు’ అని తెలిపారు. శ్రీదేవి (Sridevi) గతంలో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ విశేషాలు చెబుతూ.. ఈ చిత్రంలో తనకు ‘ప్రియతమా’.. అనే పాట ఎంతో ఇష్టమని చెప్పారు. అది చాలా అందమైన మెలోడీ. దర్శకేంద్రుడు ఆ పాటని ఎక్కువ మూమెంట్స్ లేకుండా కేవలం కంటి చూపులు, సైగలతోనే కంపోజ్ చేయించారని, అది మరపురాని పాట అని అన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్