Babil Khan: అసలు బాలీవుడ్‌లో ఏం జరుగుతుంది? ఎందుకిలా బాలీవుడ్ (Bollywood) తయారైంది? ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్, బాలీవుడ్ అంటే ఇండియన్ సినిమా అనే గుర్తింపు ఉండేది. ఎప్పుడైతే బాలీవుడ్‌కు చెందిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి చెందాడో, అప్పటి నుంచి బాలీవుడ్‌కు గ్రహణం పట్టుకుంది. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా సరైన హిట్ అయిన దాఖలాలు లేవు. దీంతో దక్షిణాది దర్శకులను నమ్ముకుని బాలీవుడ్ హీరోలు సినిమాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సౌత్ దర్శకులతో బాలీవుడ్ హీరోలు చేసిన సినిమాలే ఈ మధ్య ఆ ఇండస్ట్రీకి కాస్త ఊపిరిపోశాయి. అయినా కూడా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఏదో జరుగుతుంది? అదేంటో తెలియడం లేదు కానీ, ఆ సినిమా పరిశ్రమ రోజురోజుకు పతనానికి చేరుకుంటుందనేలా వార్తలు వినబడుతూనే ఉన్నాయి.
Also Read- Ruhani Sharma: మరోసారి పేలిన ‘రుహానీ’ అందాల బాంబు
తాజాగా బాలీవుడ్ లెజెండరీ నటుడు ఇర్ఫాన్ ఖాన్ (Irfan Khan) తనయుడు చేసిన వ్యాఖ్యలతో మరోసారి బాలీవుడ్ వార్తలలో నిలుస్తుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఎలా అయితే బాలీవుడ్ గురించి అంతా మాట్లాడుకున్నారో, సేమ్ టు సేమ్ ఇప్పుడు మరోసారి ఆ తరహాలోనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం ఇర్ఫాన్ ఖాన్ తనయుడు బాబిల్ ఖాన్. అవును, తాజాగా బాబిల్ ఖాన్ షేర్ చేసిన వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతుంది. బాలీవుడ్‌లోని కొన్ని పేర్లను ప్రస్తావిస్తూ.. ఆయన చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో దుమారాన్ని రేపుతున్నాయి. అంతేకాదు, ఈ వీడియోలో ఆయన భోరుభోరున ఏడ్చేస్తున్నాడు. అంటే, ఎంతగా ఆయన బాధపడుతున్నాడో, ఎంతగా ఆయనని బాధపెడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
అసలు బాలీవుడ్ వర్క్ చేయడానికి అనువైన ప్రదేశం కానేకాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే, ఎందుకింతగా బాధపడుతున్నాడు. బాబిల్‌ని ఎవరేం చేశారు? మరో సుశాంత్ సింగ్ రాజ్‌ఫుత్ అవుతాడా.. ఏంటి? అంటూ అందరూ ఆందోళన చెందుతుండటం విశేషం. అసలింతకీ బాబిల్ ఖాన్ ఏమన్నారంటే.. ‘‘నేను అందరికీ ఓ విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ఈ పరిశ్రమలో అర్జున్ కపూర్, అనన్య పాండే, షనయా కపూర్ వంటి వారితో పాటు, బయటి నుంచి వచ్చిన అర్జిత్ సింగ్ వంటి వారెందరో ఉన్నారు. హిందీ సినీ పరిశ్రమలో గౌరవం ఉండదు. పైకి కనిపించేంత మంచి ఇండస్ట్రీ కాదు ఇది. అత్యంత నకిలీ పరిశ్రమ ఇది. ఇక్కడ పని చేయడానికి అనువైన వాతావరణం లేదు.
Also Read- Gold Rate Today : తగ్గిన గోల్డ్ రేట్స్.. కొనడానికి ఇదే మంచి ఛాన్స్!
ప్రతి ఇండస్ట్రీలో తమ ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటారు. కానీ బాలీవుడ్‌లో అలా కాదు, అలా కోరుకునేవారు ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు. బాలీవుడ్‌కు సంబంధించి ఇలాంటి విషయాలెన్నో చెప్పాలని ఉంది..’’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు బాబిల్ ఖాన్. అయితే ఈ వీడియోని పోస్ట్ చేసిన కాసేపటికే ఆయన తొలగించడం విశేషం. అంటే ఆయనపై ఎలాంటి ఒత్తిడి వచ్చి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అంతేనా, ఆ అకౌంట్‌ని కూడా డియాక్టివేట్ చేశాడు. అంతే, ది లెజెండ్ ఇర్ఫాన్ ఖాన్ తనయుడే ఇలా మాట్లాడుతున్నాడంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అంటే, బాలీవుడ్‌లో ఏదో జరుగుతుందనేది మాత్రం ఈ ఇన్సిడెంట్‌తో నిజమే అని అనిపిస్తుంది. మరి ఈ ఇండస్ట్రీని కాపాడడానికి ఏ హీరో వస్తాడో, ఎప్పటికి వస్తాడో చూడాలి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు