Manju Warrier: ఈ మధ్య సెలబ్రిటీలు షాపింగ్ మాల్ ఓపెనింగ్స్‌కి, ఇతరత్రా కార్యక్రమాలకు హాజరైనప్పుడు కంపల్సరీగా బౌన్సర్లను మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. లేదంటే, అభిమానుల ముసుగులో ఉన్న కొందరు ఆకతాయిలు వారిపైకి దూసుకెళ్లడం, ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడం వంటివి చేస్తుంటారు. ఇప్పటి వరకు ఈ ఘటనలు అనేకం జరిగాయి. చాలా మంది హీరోయిన్ల విషయంలో ఆకతాయిలు ఇలా చేశారు. రీసెంట్‌గా శ్రీలీల బాలీవుడ్ సినిమా షూటింగ్ చేసి వస్తున్న సమయంలో అయితే.. ఏకంగా ఆమెను పక్కకి లాక్కెళ్లిపోయారు. వెంటనే తేరుకున్న శ్రీలీల ఎలాగోలా తప్పించుకుని బయటపడింది. ఇలాంటి సంఘటనలు హీరోయిన్లను భయభ్రాంతులకు గురిచేస్తాయనే విషయం తెలియంది కాదు. గతంలోనూ ఇలాంటివి చాలానే జరిగాయి.
Also Read- Sumanth: అఖిల్ కంటే ముందే అక్కినేని ఇంట్లో ఈ హీరో పెళ్లి.. నిజమేనా?
ఇప్పుడు ఎవర్‌గ్రీన్ బ్యూటీ మంజు వారియర్‌కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ప్రస్తుతం మంజు వారియర్ చేతి నిండా సినిమాలతో బిజీబిజీగా ఉంది. వన్నె తరగని అందంతో ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. రజనీకాంత్, మోహన్ లాల్ వంటి హీరోల సరసన ఆమెకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు వస్తున్నా, ఎప్పుడూ సింపుల్‌గానే నలుగురిలో కలిసిపోతూ, నవ్వుతూ కనిపిస్తుంటుంది. తాజాగా ఆమె ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వెళ్లగా అక్కడ కొందరు ఆకతాయిలు, ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన వారంతా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
అసభ్యకరంగా తాకిన అభిమానులు..
తాజాగా మంజు వారియర్‌కు ఓ చేదు అనుభవం ఎదురైంది. మంజు వారియర్ ఓ షాపింగ్ మాల్ ఓపినింగ్ కు వెళ్ళి తిరిగి వెళ్లే సమయంలో అభిమానులు ఆమెను చుట్టుముట్టారు. అభిమానులకు ఆమె అభివాదం చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఆమె నడుముపై చేయి వేశారు. అసభ్యకరంగా చేతులు ముందుకు… pic.twitter.com/sPag76awSv
— ChotaNews App (@ChotaNewsApp) May 3, 2025
షాపింగ్ మాల్ ఓపెనింగ్‌ను ముగించుకుని తన కారు దగ్గరకు వస్తున్న మంజు వారియర్ చుట్టు అభిమానులు గుమిగూడారు. వారందరూ ఫొటోలు తీసుకుంటుంటే, ఆమె ఫోజులు ఇచ్చారు. వేరొక సైడ్ నిలబడి ఫొటోలు దిగుతున్న ఆమెను, ఇటువైపు తిరగాలంటూ ఆకతాయిలు కొందరు నడుముపై చేతులు వేసి, అసభ్యకరంగా ప్రవర్తించారు. అయినా మంజు వారియర్ విసుగు చెందకుండా ఇటు వైపుకు తిరిగి వారి ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఓ అభిమాని దగ్గర ఫోన్ తీసుకుని, తనే ఫొటో తీసి మరీ ఇచ్చింది. ఆ తర్వాత కామ్‌గా కారు ఎక్కేసి వెళ్లిపోయింది. ఇక ఆమె పట్ల ఆకతాయిలు అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు పలు చర్చలకు తావిస్తుంది.
Also Read- Dilip Devgan and Janulyri: పెళ్లి చేసుకోబోతున్నాం.. ఫైనల్‌గా క్లారిటీ ఇచ్చేశారు
అసలే ఈ మధ్య లైంగిక వేధింపుల నిమిత్తం కమిటీలు ఏర్పడి, నటీమణులు క్షేమం నిమిత్తం ఏం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అలాంటి వాటిలో ఇవి కూడా చేర్చితే, ఆకతాయిల ఆట కట్టించవచ్చు. అయినా పబ్లిక్ ఫంక్షన్స్‌కు వెళ్లేటప్పుడు నటీమణులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పాత రోజులు వేరు, ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది. వారికి ఫొటో కావాలి. అందుకోసం ఏమైనా చేస్తారు. ఇదే అదనుగా చూసుకుని కొందరు ఆకతాయిలు ఇలాంటి పనులు చేస్తుంటారు. కాబట్టి, మంజు వారియర్ వీడియో చూసిన తర్వాతైనా, సెలబ్రిటీలు ముఖ్యంగా నటీమణులు ఇలాంటివి విషయాల్లో జాగ్రత్తలు వహిస్తారని ఆశిద్దాం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు