Health Department
తెలంగాణ

Health Department: డైలమాలో మెడికల్ బోర్డు.. వెయిటేజ్ ఇవ్వాలా? వద్దా?

Health Department: ఆరోగ్య శాఖ (Health Department) లో వెయిటేజ్ అంశం ఇప్పుడు సమస్యాత్మకంగా మారింది. నర్సింగ్ ఆఫీసర్స్ (Nursing Officers), ల్యాబ్ టెక్నీషియన్లు, ఎంపీహెచ్ఏ ఫలితాల ఆలస్యానికి కారణం కూడా ఇదేనంటూ ఉన్నతాధికారులు చెప్తున్నారు. గతంలో ఉద్యోగాలు పొందినోళ్లు కూడా ప్రభుత్వం విడుదల చేసిన లెటెస్ట్ నోటిఫికేషన్లలో దరఖాస్తు చేసి, మెడికల్ బోర్డు (Medical Board) ఆధ్వర్యంలో జరిగిన పరీక్షల్లో పాల్గొన్నారు. అయితే, వెయిటేజ్ మార్కుల సర్టిఫికెట్స్ కూడా మళ్లీ పొందుపరిచారు. గతంలో వెయిటేజ్ క్లెయిమ్ చేసి ఉద్యోగాలు పొందినోళ్లకు, మళ్లీ వెయిటేజ్ ఇవ్వాలా వద్దా? అని మెడికల్ బోర్డు తర్జన భర్జన పడుతున్నది. దీంతో ప్రభుత్వం లీగల్ ఓపీనియన్‌కు వెళ్లింది. ఇప్పటికే ఉద్యోగాలు పొంది, మళ్లీ ఈ నోటిఫికేషన్లలో కూడా పరీక్ష రాసిన వారిలో సుమారు 600 మంది నర్సింగ్ ఆఫీసర్లు, 2 వందల మంది ల్యాబ్ టెక్నిషియన్స్‌తో పాటు మిగతా కేడర్ లలో మరో 2 వందల మంది వరకు ఉన్నట్లు బోర్డు గుర్తించింది. లీగల్ ఓపీనియన్ రాగానే వాటిని ఫిల్టర్ చేసి ఫలితాలు ప్రకటించే ఛాన్స్ ఉన్నది. మరోవైపు వెయిటేజ్ మార్కులు క్లెయిమ్ చేసుకొని గతంలో ఉద్యోగాలు పొందినోళ్లకు మళ్లీ వెయిటేజ్ ఇవ్వొద్దని పలువురు అభ్యర్ధులు ఇప్పటికే మెడికల్ బోర్డు, ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు. దీంతో ప్రభుత్వం సీరియస్‌గా స్టడీ చేస్తున్నది. గతంలో వెయిటేజ్‌తో జాబ్ పొందినోళ్లకు దాదాపు ఈ సారి కలిపే ఛాన్స్ లేదనేది విశ్వసనీయ వర్గాలు సమాచారం. ఇక ఇప్పటికే వెయిటేజ్ మార్కులతో జాబ్ పొందినప్పటికీ, ఈ సారి మెరిట్(వెయిటేజ్ మార్కులు లేకుండా) వస్తేనే అర్హత సాధిస్తారు. ఈ అంశాలపై రెండు రోజుల్లో స్పష్టత వచ్చే ఛాన్స్ ఉన్నదని సెక్రటేరియట్‌లోని ఓ అధికారి తెలిపారు.

Read also- Congress Leaders: గ్రూపు రాజకీయాలతో కాంగ్రెస్ పరేషాన్ .. కార్యకర్తలకే పదవులా!

6 వేల ఉద్యోగాల పెండింగ్?

ప్రభుత్వం వివిధ నోటిఫికేషన్ల ద్వారా సుమారు 6 వేల పోస్టులకు పరీక్షలు పెట్టింది. ఇప్పుడు ఆ ఫలితాలన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్ 11న 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు, సెప్టెంబరు 18న 2322 నర్సింగ్ ఆఫీసర్లు, అదే నెల 24న 633 ఫార్మసిస్టుల పోస్టుల భర్తీకి మెడికల్ బోర్డు నోటిఫికేషన్లను ప్రకటించింది. దీంతో పాటు 2023లోనే నోటిఫికేషన్ ఇచ్చిన 2 వేల ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల ఫలితాలు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇవన్నీ కలిపి దాదాపు 6170 పోస్టులకు ఫలితాలు రావాల్సి ఉన్నది. వెయిటేజ్ అంశంపై స్పష్టత రాగానే రిజల్ట్స్ వెల్లడిస్తామని ఉన్నతాధికారులు చెప్తున్నారు. వంద మార్కులకు పరీక్షలు నిర్వహిస్తుండగా, ఇందులో 80 మార్కులు రాతపూర్వక మార్కులు, 20 వెయిటేజ్ మార్కులు ఉంటాయి. ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తే వెయిటేజ్ కల్పిస్తారు. గిరిజన ప్రాంతాల్లో 6 నెలలకు పైగా పనిచేస్తే 2.5 మార్కులు, అర్బన్‌లో వర్క్ చేస్తే 2 మార్కులు చొప్పున గరిష్టంగా 20 మార్కులు కేటాయిస్తారు. ఇందుకు సంబంధించిన ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్, డీఎమ్‌హెచ్‌వో, టీచింగ్ ఆసుపత్రుల హెచ్‌వోడీల అనుమతి పత్రాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.

మే 5న నర్సింగ్ ఆఫీసర్స్?

మే 5న నర్సింగ్ ఆఫీసర్స్, 12న ల్యాబ్ టెక్నిషియన్ల ఫలితాలను ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తున్నద. ఈ లోపే లీగల్ ఓపీనియన్‌ను తెప్పించి వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు పంపాలని ఆలోచిస్తున్నది. ప్రభుత్వం ఐదారు నెలల క్రితమే పరీక్షలు నిర్వహించినా, ఎన్నికల కోడ్, ఎక్కువ మంది అభ్యర్థులు పరీక్షలు రాయడం, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సర్టిఫికేట్ల వేరిఫికేషన్, వెయిటేజ్ అంశాలను ఆలస్యానికి కారణమయ్యాయి.

Read Also- Kishan Reddy: కాంగ్రెస్ చేసింది క్యాస్ట్ సర్వే.. అది కూడా తూతూ మంత్రమే..

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?