Dost Registration 2025 (Image Source: Twitter)
తెలంగాణ

Dost Registration 2025: గుడ్ న్యూస్.. నేటి నుంచే అప్లికేషన్స్.. ఇలా అప్లై చేయండి!

Dost Registration 2025: తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్​ లైన్ సర్వీసెస్, తెలంగాణ(దోస్త్) నోటిఫికేషన్ ప్రకటించారు. ఈ అడ్మిషన్ల ప్రక్రియను మూడు విడుతల్లో చేపట్టనున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. శుక్రవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో దోస్త్ 2025 కమిటీ సమావేశం జరిగింది. అనంతరం దోస్త్ నోటిఫికేషన్, షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన రిలీజ్ చేశారు.

ఆ కోర్సుల్లో అడ్మిషన్స్
ఫస్ట్ ఫేజ్ రిజిస్ర్టేషన్ల ప్రక్రియ నేటి (మే 3) నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 21వ తేదీ వరకు ఫస్ట్ ఫేజ్ దరఖాస్తుకు గడువు విధించారు. మే 29న సీట్ల అలాట్మెంట్ చేయనున్నారు. కాగా, జూన్ 30 నుంచి డిగ్రీ ఫస్టియర్ క్లాసులు మొదలుకానున్నాయి. తెలంగాణలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, జేఎన్టీయూ, చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఎస్ డబ్ల్యూ తదితర కోర్సుల్లో అడ్మిషన్లు చేపట్టనున్నారు. స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు ఆధ్వర్యంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో డీ ఫార్మసీ కోర్సుల్లోనూ ప్రవేశాలు కల్పించనున్నారు.

మెుత్తం సీట్లు ఎంతంటే?
రాష్ట్రంలోని సర్కారు, ప్రైవేట్, ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు 908 ఉండగా, వాటిలో 3,93,467 సీట్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు 79 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ఉండగా, వాటిలో 23,654 సీట్లున్నాయి. అయితే రెసిడెన్షియల్ కాలేజీల్లో ఆయా సొసైటీలే ప్రవేశాలు నిర్వహిస్తుంటాయి. కాగా, ఈనెల 3 నుంచి ఫస్ట్ ఫేజ్ రిజిస్ర్టేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా, 10 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మొదలు కానుంది. 29న సీట్ల కేటాయింపు చేయనున్నారు.

ఫీజు వివరాలు
ఫస్ట్ ఫేజ్ రిజిస్ర్టేషన్ కు ఫీజు రూ.200 ఉండగా, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ రిజిస్ర్టేషన్ ఫీజు రూ.400 ఉంటుందని అధికారులు ప్రకటించారు. డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియలో విద్యార్థులకు సహాయం అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 40 హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి చెప్పారు. ఆధార్ వివరాల్లో పొరపాట్లు, అప్​లోడ్ చేసిన సర్టిఫికేట్లలో ఏమైనా లోపాలుంటే వాటికి ఆయా సెంటర్లలో పరిష్కారం చేసుకోవచ్చని తెలిపారు. జిల్లా హెల్ప్ లైన్ సెంటర్లు 33, వర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్లు ఆరు, రాష్ట్రస్థాయి సెంటర్ ఒకటి ఉంటుందని వెల్లడించారు. విద్యార్థులు దోస్త్ వెబ్ సైట్ https://dost.cgg.gov.in ద్వారా విద్యార్థులు రిజిస్ర్టేషన్ చేసుకునే అవకాశం కల్పించారు.

ఫస్ట్ ఫేజ్ :
మే 3 నుంచి మే 21 వరకు దరఖాస్తుల స్వీకరణ
మే 10 నుంచి మే 22 వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం
మే 29 న మెుదటి ఫేజ్‌ సీట్ల కేటాయింపు
జూన్ 6 వరకూ ఆన్​లైన్​ స్పెల్ఫ్​ రిపోర్టింగ్

సెకండ్ ఫేజ్‌:
మే30 నుంచి జూన్ 8 వరకు దరఖాస్తులు
మే 30 నుంచి జూన్ 9 వరకు వెబ్ ఆప్షన్లు
జూన్ 13 న రెండో ఫేజ్‌ సీట్ల కేటాయింపు
జూన్ 18 వరకూ ఆన్​లైన్​ స్పెల్ఫ్​ రిపోర్టింగ్

థర్డ్ ఫేజ్‌ :
జూన్13 నుంచి జూన్ 19 వరకు దరఖాస్తులు
జూన్ 13 నుంచి జూన్ 19 వరకు వెబ్ఆప్షన్లు
జూన్ 23 న థర్డ్ ఫేజ్‌ సీట్ల కేటాయింపు
జూన్ 28 వరకూ ఆన్​లైన్​ స్పెల్ఫ్​ రిపోర్టింగ్
జూన్ 24 నుంచి 28 వరకూ ఓరియంటేషన్ క్లాసులు
జూన్ 30 నుంచి డిగ్రీ ఫస్టియర్ తరగతులు

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?