Sunitha – Pravasthi: సింగర్ ప్రవస్తి వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. అసలు ఎవరూ ఉహించని విధంగా ఆ అమ్మాయి మీడియా ముందుకొచ్చి ” పాడుతా తీయగా ” షో గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఆ షో కి జడ్జెస్ గా వ్యవహరిస్తున్న స్టార్ సింగర్స్ సునీత, మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ ఎమ్ కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో, ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. ఆ అమ్మాయి చెప్పినవి విన్న తర్వాత సింగింగ్ ఇండస్ట్రీలో ఇంత జరుగుతుందా అనే సందేహాలు వస్తున్నాయి. అయితే, తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ్ ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలను బయట పెట్టాడు. ప్రస్తుతం, దీనికి సంబందించిన సోషల్ మీడియాలో వీడియోలో తెగ వైరల్ అవుతుంది.
తమ్మారెడ్డి తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ ” ఆరోపణలు అని అంటే అవే ఆరోపణలే అని అర్థం. దీనిలో ఎంత నిజం ఉంది? ఎంత అబద్దం ఉందనేది నిదానంగా అదే తెలుస్తుంది. బాలు గారు స్టార్ట్ చేసిన పాడుతా తీయగా షో ఎవరికి కాంపిటేషన్ కాదు. నేను ప్రవస్తి వీడియోను కూడా చూశాను. ఆ అమ్మాయి చాలా చోట్ల ఓడిపోయాను అని ఆమె చెబుతుంది. అలాగే కొన్ని చోట్ల తీసేశారని కూడా చెబుతోంది. అంటే ఇక్కడ తీసేయడం ఆమెకి కొత్తెం కాదు. గొప్ప సింగర్ అయితే అన్నీ సార్లు తీయరు కదా.. ఇప్పుడు కూడా తీసేసి ఉండొచ్చు. ఏ షో అయిన సరే టీఆర్పీ ని బట్టే రన్ అవుతుంది. ఎవరిదైతే రెండు వారాలు కంటే, ఎక్కువ ఉంటుందో ఆ సింగర్ ను లేపడానికి ట్రై చేస్తుంటారు. ఎవరైతే వీక్ గా ఉంటారో వాళ్ళని మెల్లిగా పంపించేస్తారు. సునీత, ప్రవస్తిని తీసేస్తే ఆమెకి ఏం వస్తాది? ఏమి రాదు. ఇప్పుడు తనని తీసేస్తా.. తన వలన ఏ బిల్డింగ్ లు కట్టదని అన్నాడు.
Also Read: Single Controversy: ‘కన్నప్ప’కు సారీ చెప్పారా? చెప్పించారా? కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పడినట్టేనా!
ఆయన మాట్లాడుతూ ” పోనీ ఆమెకు, ఈ అమ్మాయికి ఏమైనా వైరం ఉందా అంటే అది కూడా లేదు. షో అన్నాక చిన్న చిన్న గొడవలు ఉంటాయి. దానికి ప్రవస్తి అంత చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది అందరికీ తెలిసిపోయింది. ఇంత సీరియస్ గా ఆ అమ్మాయి ఎందుకు తీసుకుందో ఆమెకే తెలియాలి. కాంపిటేషన్ అన్నాక ఎవరో ఒకరు మాత్రమే గెలుస్తారు. మిగతా వాళ్ళు ఓడిపోతారు. ఇది తనకి ఆర్డమైతే ఇలా సీరియస్ గా తీసుకునేది కాదేమో ” అంటూ కామెంట్స్ చేశాడు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు