Miss World Contestants (imagecredit:AI)
తెలంగాణ

Miss World Contestants: మిస్ వరల్డ్ ఈవెంట్ లో స్వల్ప మార్పులు.. అవేంటంటే!

తెలంగాణ: Miss World Contestants: రాష్ట్రంలో తొలిసారిగా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. 140 దేశాలకు చెందిన పోటీదారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా ఈ నెల 13న చార్మినార్ టు చౌమలా ప్యాలేస్ వరకు హెరిటేజ్ వాక్ నిర్వహిస్తున్నారు. చార్మినార్, లాడ్ బజార్ లో మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేవారు సందర్శించనున్నారు. ఈ ప్రాంతానికి మరింత ప్రాముఖ్యం తీసుకురానున్నారు.

మిస్ వరల్డ్ పోటీలకు ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది. పోటీల్లో పాల్గొనేందుకు ప్రపంచంలోని 140 దేశాలకు చెందిన కంటెస్టెంట్స్ ఈ పోటీల్లో పాల్గొంటారని, వారితో పాటు ఆదేశానికి చెందిన అధికారులు, మీడియా ప్రతినిధులు దాదాపు 3000వరకు రానున్నారు.ఈ నెల 6, 7 తేదీల్లో హైదరాబాద్ కు చేరుకుంటారని అధికారులు తెలిపారు. మే 10వ తేదీన గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ ఓపెనింగ్ సెర్మనీని నిర్వహించనున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రారంభిస్తారు. పోటీల్లో భాగంగా ఈ 13న హైదరాబాద్ హెరిటేజ్ వాక్ పేరిట చార్మినార్, లాడ్ బజార్ లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ సందర్శించనున్నారు. లాడ్ బజార్ లో మట్టిగాజులు కొనుగోలు చేయనున్నారు. అక్కడ పలు స్టాళ్లను సందర్శించనున్నట్లు సమాచారం. అదే రోజూ రాత్రి చౌమలా ప్యాలేస్ లో 500మందితో సమావేశం ఏర్పాటు చేశారు. పోటీదారులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

Also Read: YS Sharmila On Modi: మోదీజీ ఈసారైనా పూర్తి చేస్తారా? రాజధాని పై షర్మిల కీలక వ్యాఖ్యలు..

మే 14న వరంగల్ లోని కాళోజీ కళాక్షేత్రంలో విద్యార్థులు, వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులతో అమెరికా, కరీబియన్(గ్రూప్ 1) మిస్ వరల్డ్ కు వచ్చిన కంటెస్టెంట్స్ ఇంటరాక్ట్ కానున్నట్లు షెడ్యూల్ రూపొందించారు. అయితే ఈ షెడ్యూల్ లో స్వల్ప మార్పు చేశారు. కాళోజీ కళాక్షేత్రం కాకుండా వెయ్యిస్తంభాల గుడికి మార్పు చేశారు. కంటెస్టులు అందరూ వెయ్యి స్తంభాలను సందర్శించనున్నట్లు తెలిపారు. తెలిపారు. అదేరోజు కాకతీయ హెరిటేజ్ టూర్ లో భాగంగా రామప్పను సందర్శించనున్నారు.

యూరప్(గ్రూప్ 2) కు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ స్పిరిచువల్ టూర్ లో భాగంగా మే 15న యాదగిరిగుట్టను సందర్శించనున్నారు. ఆపై పోచంపల్లి హ్యాండ్ లూమ్స్ ఇండస్ట్రీని పరిశీలించనున్నారు. మెడికల్ టూరిజంలో భాగంగా ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్(గ్రూప్ 3) మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ మే 16న అపోలో, ఏఐజీ, యశోద హాస్పిటల్స్ సందర్శనకు వెళ్లనున్నారు. మిస్ వరల్డ్ స్పోర్ట్స్ ఫినాలే గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మే 17న జరగనుంది.

కాంటినెంటల్ ఫినాలే మే 20, 21 తేదీల్లో టీ హబ్ వేదికగా జరగనున్నాయి. రీజియన్ల వారీగా ఫాస్ట్ ట్రాక్ సెలక్షన్ కోసం కాంటినెంటల్ క్లస్టర్స్ పోటీలు టీ హబ్ లో నిర్వహిస్తున్నారు. కరీబియన్, ఆఫ్రికా, ఆసియా, యూరప్ కు చెందిన దేశాలు ఈ ఈవెంట్ లో పాల్గొంటాయి. మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలేకు శిల్పకళా వేదిక ఆతిథ్యమివ్వనుంది. మే 22న ఈ ఈవెంట్ జరగనుంది. హెడ్ టు హెడ్ చాలెంజ్ ఫినాలే మే 23న గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో నిర్వహిస్తున్నారు.

Also Read: Jangaon district: ఉపాధి కూలీ పనుల తవ్వకాల్లో పురాతన శిల్పం లభ్యం.. ఎక్కడంటే!

మిస్ వరల్డ్ టాప్ మోడల్, ఫ్యాషన్ ఫినాలేను మే 24న హైటెక్స్ లో నిర్వహించనున్నారు. ఈ పోటీలో తెలంగాణకు సంబంధించిన ఫ్యాషన్ డిజైనర్లతో ఇంటరాక్షన్ కూడా ఉండనుంది. మే 25న హైటెక్స్ లో జ్యుయెలరీ, పెరల్ ఫ్యాషన్ షో నిర్వహిస్తున్నారు. మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలు హైటెక్స్ వేదికగా జరగనున్నాయి. మే 31న ఈ గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ పోటీలో విజేత తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న రాజ్ భవన్ లో గవర్నర్, ముఖ్యమంత్రిని కలుసుకోనున్నారు.

22కు చేరిన ప్రర్యాటక ప్రదేశాలు

మిస్ వరల్డ్ పోటీదారులు, ప్రతినిధులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా టూరిజంశాఖ ఏర్పాట్లు చేసింది. తొలుత 20 ప్రాంతాలు అనుకొని 21 పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లాలని భావించారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రిని లిస్టులో చేర్చారు.దీంతో పోటీదారులు సందర్శించే పర్యాటక ప్రాంతాలు 22కు చేరింది.

కాళోజీ కళాక్షేత్రానికి బదులుగా వెయ్యిస్తంభాల గుడిని చేర్చిన అధికారులు మిగిలిన 20 ప్రాంతాల విషయంలో ఎలాంటి మార్పు చేయలేదు. మిస్ వరల్డ్ పోటీలపై ఈ నెల 4న సీఎం రేవంత్ రెడ్డి మరోసారి అధికారులతో సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. సమన్వయంపై ప్రభుత్వం ప్రత్యేక కమిటీని వేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Just In

01

VV Vinayak: చాలా రోజుల తర్వాత దర్శకుడు వివి వినాయక్ ఇలా..!

Blast in Match: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్‌లో పేలుడు.. పాక్‌లో షాకింగ్ ఘటన

Karthik Gattamneni: తొమ్మిది గ్రంథాలు దుష్టుల బారిన పడితే.. ‘మిరాయ్‌’ మన రూటెడ్ యాక్షన్ అడ్వెంచర్

BRS Committees: స్థానిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కమిటీలు?.. పేర్లు సేకరిస్తున్న అధిష్టానం!

Khammam ashram school: అమానుషంగా ప్రవర్తించిన హెడ్మాస్టర్.. తండ్రి లేని బాలికను ఆశ్రమ స్కూల్ నుంచి గెంటేశారు