Gold Tiffin Box Case (imagecredit:swetcha)
తెలంగాణ

Gold Tiffin Box Case: నిజాం బంగారు టిఫిన్ బాక్స్ చోరీ.. యువకునికి యావజ్జీవ శిక్ష!

తెలంగాణ: Gold Tiffin Box Case: మహ్మద్​ గౌస్​ ఎలియాస్​ ఖూనీ గౌస్​ మామూలోడు కాదు. పాతబస్తీలోని నిజాం మ్యూజియం నుంచి నిజాం నవాబు వాడిన బంగారు టిఫిన్​ బాక్స్​ ను తస్కరించిన ఘనుడు. కొంతకాలం క్రితం ఓ హత్య కేసులో అరెస్టయిన మహ్మద్​ గౌస్​ కు 9వ అదనపు జిల్లా సెషన్స్​ కోర్టు జడ్జి యావజ్జీవ కారగార శిక్ష, 10వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి. పాతబస్తీకి చెందిన మహ్మద్​ గౌస్ చెడు సావాసాలతో చిన్నతనం నుంచే నేరాలు చేయటం మొదలు పెట్టాడు.

యుక్తవయసు వచ్చేసరికి సిటీ పోలీసులకు మోస్ట్​ వాంటెడ్​ గా మారాడు. కాగా, 2018, సెప్టెంబర్​ లో పాతబస్తీలోని నిజాం మ్యూజియం చూడటానికి మహ్మద్​ గౌస్ స్నేహితునితో కలిసి వెళ్లాడు. అయితే, అతని దుస్తులు, వాలకం చూసిన సెక్యూరిటీ సిబ్బంది మహ్మద్​ గౌస్ ను వెనక్కి పంపించి వేశారు. దీనిని అవమానంగా భావించిన మహ్మద్​ గౌస్​ పక్కాగా రెక్కీ చేసి మ్యూజియంలోకి రాత్రి వేళ చొరబడ్డాడు. ఆఖరు నిజాం మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ వాడిన వజ్రాలు పొదిగి ఉన్న బంగారు టిఫిన్​ బాక్స్​ ను అపహరించాడు.

Also Read: Ponnam Prabhakar: సమ్మె వద్దు మాకు సహకరించండి.. మంత్రి పొన్నం!

ఆ తరువాత ముంబయికి పారిపోయాడు. అక్కడ కొన్ని రోజులపాటు ఉన్న మహ్మద్​ గౌస్​ అదే టిఫిన్​ బాక్స్​ లో అన్నం పెట్టుకుని తిన్నాడు. ఆ తరువాత హైదరాబాద్​ తిరిగొచ్చి పోలీసులకు లొంగిపోయాడు. చోరీ చేసిన నిజాం నవాబు బంగారు టిఫిన్​ బాక్స్​ ను అప్పగించాడు. ఈ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన మహ్మద్​ గౌస్​ బెయిల్​ పై విడుదలైన తరువాత నేరాలు చేయటాన్ని కొనసాగించాడు. కాగా, రాజేంద్రనగర్​ నివాసి సవర్​ ఖాన్​ తో అతనికి పాతకక్షలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో 2023లో ఇద్దరు సహచరులతో కలిసి సవర్​ ఖాన్​ ను కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో మహ్మద్​ గౌస్ తోపాటు అతని సహచరులను అరెస్ట్​ చేసిన రాజేంద్రనగర్ పోలీసులు కోర్టులో ఛార్జిషీట్​ దాఖలు చేశారు. కేసును విచారించిన జడ్జి హత్యకు పాల్పడ్డ మహ్మద్​ గౌస్​ కు యావజ్జీవ కారాగార శిక్ష, 10వేల రూపాయల జరిమానా విధించారు. అతని ఇద్దరు సహచరులకు కూడా జైలు శిక్ష వేశారు.

స్వేచ్ఛ E పేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

Just In

01

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?