Hit 3 Success Meet
ఎంటర్‌టైన్మెంట్

Natural Star Nani: నేను కరెక్ట్ అని ప్రూవ్ చేశారు.. పవన్ కళ్యాణ్‌కు థ్యాంక్స్!

Natural Star Nani: నేచురల్ స్టార్ నాని హీరోగా, కెజియఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. ఈ సినిమా మే డే స్పెషల్‌గా గురువారం పాన్ ఇండియా స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదలై, మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని గ్రాండ్‌గా నిర్మించారు. సినిమా విడుదలకు ముందే హ్యూజ్ బజ్‌ని ఏర్పరచుకున్న ఈ సినిమా, రిలీజ్ తర్వాత అందరినీ ఆకట్టుకొని బ్లాక్ బస్టర్ సక్సెస్ దిశగా దూసుకెళుతోంది. చిత్ర సక్సెస్‌ను పురస్కరించుకుని మేకర్స్ తాజాగా సక్సెస్ మీట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (Hit 3 Success Meet)

Also Read- Chiranjeevi: నన్ను నేను మలుచుకున్నా.. వేవ్స్ సమ్మిట్‌లో మెగాస్టార్ స్పీచ్ వైరల్

ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇది ఒక అద్భుతమైన రిలీజ్ డే. ఈ రోజు మార్నింగ్ లేచిన తర్వాత నా ఫోన్ చూస్తే మెసేజ్‌లతో నిండిపోయింది. ఇండస్ట్రీ, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా సినిమా చాలా బాగుంది అంటూ మంచి ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. ఎన్నో రిలీజ్ డేస్ చూశాను. కానీ ఈ రిలీజ్ డేట్ వైబ్ అదిరిపోయింది అంతే. సినిమా బుకింగ్స్ మాములుగా లేవు.. సినిమా సూపర్ హిట్. ఇవన్నీ పక్కన పెడితే ఇది జస్ట్ బిగినింగ్ ఆఫ్ ‘హిట్ 3’ జర్నీ. ఇక నుంచి ప్రతి రోజూ ఒక సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది. ఇది ఎక్కడికెళ్లి ల్యాండ్ అవుతుందనేది మా టీమ్ అంచనాలకి కూడా అందడం లేదు. అందుకే ఇప్పుడే నేను ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వదలుచుకోలేదు.

మీ అందరి ప్రేమని ఎక్స్‌పీరియెన్స్ చేస్తున్నాం. ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చాలా చాలా ఆనందాన్నిచ్చింది. ఇది ఇప్పుడప్పుడే ఆగదు. ఈ సినిమాకి కనీసం నాలుగైదు సెలబ్రేషన్స్ చేయాలి. అందులోనూ ఈ సినిమాకు నేను నిర్మాతను కూడా కాబట్టి ఎక్స్‌ట్రా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ప్రతిసారి నాకో నమ్మకం ఉంటుంది. నేను, మీరు (ప్రేక్షకులు) ఒకటేనని నమ్మిన ప్రతిసారి.. మీరు నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసినందుకు.. మీ అందరికీ పేరుపేరునా థాంక్యూ సో మచ్. సినిమాని ఇంత అద్భుతంగా సపోర్ట్ చేసిన మీడియాకు థాంక్యూ. మీడియా సపోర్ట్‌తోనే ఈ బ్లాక్ బస్టర్ సాధ్యమైంది. మే ఫస్ట్ స్టార్ట్ అయింది. మే అంతా ఇది సెలబ్రేషన్స్ లాగా ఉండాలని కోరుకుంటున్నాను.

Also Read- Mega Family: వామ్మో.. అవకాయ పచ్చడికి పూజలు! చిరు భార్య సురేఖ ఏం చేస్తుందో చూశారా!

ఈరోజు (గురువారం) రాత్రికి అమెరికా వెళుతున్నాను. నాలుగైదు రోజులు పాటు అందుబాటులో ఉండను. వచ్చిన వెంటనే అందరినీ కలిసి.. గ్రాండ్‌గా సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకుందాం. శైలేష్ విషయంలో చాలా గర్వంగా ఫీలవుతున్నాను. ఇది తన విజన్‌కి ఒక టీజర్, ట్రైలర్ లాంటిది మాత్రమే. మాకు ఎప్పుడూ సపోర్ట్ చేసే నిర్మాత దిల్ రాజుకు థాంక్యూ సో మచ్. టికెట్ల ధరల విషయంలో సపోర్ట్ చేసిన ఏపీ గవర్నమెంట్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) అందరికీ మా టీమ్ తరపున కృతజ్ఞతలు. ఇది తెలుగు సినిమా విజయం. రాబోయే సినిమాలు కూడా ఇదే సక్సెస్‌ని కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. ప్రేక్షకులందరూ ఇలాగే ప్రతి సినిమాను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని నాని తన ఆనందాన్ని తెలియజేశారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్