Megastar Chiranjeevi
ఎంటర్‌టైన్మెంట్

Chiranjeevi: నన్ను నేను మలుచుకున్నా.. వేవ్స్ సమ్మిట్‌లో మెగాస్టార్ స్పీచ్ వైరల్

Chiranjeevi: ప్రస్తుతం ఇండియన్ సినిమా ప్రపంచ సినిమాను శాసిస్తుంది. ఇది గమనించిన కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో వేవ్స్ (వరల్డ్‌ ఆడియో విజువల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌)కు శ్రీకారం చుట్టింది. ఇండియాలోని అన్ని సినిమా ఇండస్ట్రీలలో ఉన్న సినీ ప్రముఖులను ఒకచోటకి చేర్చి, వారిని అడ్వైజరీ బోర్డు మెంబర్స్‌గా మార్చి, వారితో చర్చలు జరిపింది. ఈ చర్చలలో ప్రధాని మోదీ కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ వేవ్స్ 2025 (Waves 2025) కార్యక్రమం గురువారం ముంబైలో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ వేవ్స్‌కి అడ్వజరీ మెంబర్ అయిన మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ తరపున తన వాయిస్ వినిపించారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో చిరంజీవితో పాటు భారత చలన చిత్ర సీమకు సంబంధించిన ప్రముఖులెందరో పాల్గొన్నారు.

Also Read- Mega Family: వామ్మో.. అవకాయ పచ్చడికి పూజలు! చిరు భార్య సురేఖ ఏం చేస్తుందో చూశారా!

ప్రధాని చేతుల మీదుగా ఈ సమ్మిట్ ప్రారంభమైన అనంతరం ‘లెజెండ్స్ అండ్ లెగసీస్’: ది స్టోరీస్ దట్ షేప్డ్ ఇండియాస్ సోల్’ అనే చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రజనీకాంత్, చిరంజీవి, మోహన్ లాల్, హేమ మాలిని, మిథున్ చక్రవర్తి వంటివారంతా పాల్గొన్నారు. ఈ సెషన్‌ను అక్షయ్ కుమార్ నిర్వహించగా.. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)కి ఆయన ఓ ప్రశ్నకు సంధించారు. మీరు ఇండస్ట్రీకి రావడానికి స్ఫూర్తి ఎవరు? మీలో ఆ స్ఫూర్తి నింపిన వారి గురించి చెప్పాలని కోరారు. వెంటనే చిరంజీవి మాట్లాడుతూ..

‘‘బాల్యంలో నేను ఎక్కువగా డ్యాన్సులు చేస్తూ ఫ్యామిలీ మెంబర్స్‌ని, స్నేహితులను ఎంటర్‌టైన్ చేసేవాడిని. అలా నటనపై నాకు ఆసక్తి మొదలై, చివరకు మద్రాసు (చెన్నై) వెళ్లి ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యేలా చేసింది. అయితే నేను ఇండస్ట్రీకి వచ్చేనాటికి దాదాపు అరడజనుకు పైగా సూపర్ స్టార్లు ఉన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి సూపర్ స్టార్ల మధ్య నాకసలు అవకాశం వస్తుందా? అని అనుకున్నాను. అప్పుడే వీళ్లందరి కంటే భిన్నంగా ఏదో ఒకటి చేయాలని స్ట్రాంగ్‌గా ఫిక్సయ్యాను. అలా ఏం చేయగలనా? అని ఆలోచించాను. అప్పుడే నా మదిలోకి ఫైట్స్, డ్యాన్స్ వచ్చాయి. వీటి కోసం మరింత శిక్షణ తీసుకున్నాను. అవే ఇప్పుడు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయని కచ్చితంగా చెప్పగలను.

Also Read- Hit 3 Review: బాబోయ్ ఇదేం ఊచకోత.. ‘హిట్ 3’ ఎలా ఉందంటే..

మేకప్ లేకుండా సహజంగా నటించడం అప్పటి బాలీవుడ్ నటుడు, ఇప్పుడు నా ఎదురుగానే ఉన్నారు మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty)ని చూసి నేర్చుకున్నా. స్టంట్స్ విషయంలో అమితాబ్ (Amitabh Bachchan), డ్యాన్స్ విషయంలో నా సీనియర్ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) నాకు స్పూర్తిగా నిలిచారు. వీళ్లందరినీ చూస్తూ, ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నన్ను నేను మలుచుకుంటూ ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను’’ అని అన్నారు. చిరంజీవి ఈ మాటలు చెబుతుంటే, ఎదురుగా కూర్చున్న వారంతా క్లాప్స్‌తో సమ్మిట్‌ను హోరెత్తించారు. ప్రస్తుతం చిరంజీవి మాట్లాడుతున్న ఈ వీడియో సోషల్ మాధ్యమాలలో బాగా వైరల్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవికి స్ఫూర్తినిచ్చిన హీరోలు మిథున్ చక్రవర్తి, అమితాబ్, కమల్ హాసన్ అంటూ మెగా ఫ్యాన్స్ వారి పేర్లను వైరల్ చేస్తున్నారు. మరికొందరేమో.. తెలుగు హీరోలు ఒక్కరు కూడా మీలో స్ఫూర్తి నింపలేదా? అంటూ క్వశ్చన్ చేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు