Athammas Kitchen Pickle
ఎంటర్‌టైన్మెంట్

Mega Family: వామ్మో.. అవకాయ పచ్చడికి పూజలు! చిరు భార్య సురేఖ ఏం చేస్తుందో చూశారా!

Mega Family: ఈ వేసవి సీజన్‌లో అందరూ మాట్లాడుకునే, కావాలనుకునే పండు ఏదైనా ఉందీ అంటే, అది కచ్చితంగా మామిడి అనే చెప్పుకోవచ్చు. వేసవిలో లభించే మామిడిని తినడంతో పాటు పచ్చళ్లు పట్టుకోవడానికి కూడా వాడతారు. సంవత్సరానికి సరిపడా ఆవకాయ పచ్చడిని ఎంతో నియమ నిష్టలతో పడతారనే విషయం తెలియంది కాదు. కాకపోతే, పట్టిన పచ్చడికి కూడా పూజలు చేయడం మాత్రం ఫస్ట్ టైమ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఇంట్లోనే చూడటం జరుగుతుంది. అవును, మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ (Surekha).. నిండా ఆవకాయ పచ్చడి (Mango Pickle) ఉన్న జాడీని దేవుడి పటాల ముందు పెట్టి, పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఇలా పూజలు చేస్తున్న వీడియోని సురేఖమ్మ కోడలు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వైఫ్ ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.

Also Read- Waves Summit 2025: ‘వేవ్స్ 2025’.. అతిరథమహారధుల సమక్షంలో అతి పెద్ద వినోద కార్యక్రమం ప్రారంభం

ముఖ్యంగా సురేఖమ్మ అలా పూజలు చేయడంపైనే అంతా మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ వీడియోని పోస్ట్ చేసిన ఉపాసన (Upasana Konidela), ‘‘సురేఖగారు అలియాస్ నా ప్రియమైన అత్తమ్మ.. ఈ సీజన్ ఆవకాయ పచ్చడితో నిజంగా అందరికీ నోరూరించేలా చేశారు. మా అత్తమ్మకు ఆహారం అంటే కేవలం పోషకాహారానికి సంబంధించిన విషయమే కాదు.. ఇది సంస్కృతి, వారసత్వాన్ని కాపాడుకునే మార్గం’’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా అత్తమ్మ కిచెన్‌లో ఈ ఆవకాయ లభిస్తుందని చెప్పడంతో పాటు, ఎంతో సాంప్రదాయ బద్దంగా ఈ ఆవకాయ పచ్చడిని ప్రిపేర్ చేశామని చెప్పడం ఉపాసన ఉద్దేశ్యం.

ఇదే విషయాన్ని నెటిజన్లు కొందరు తమ కామెంట్స్‌లో చెబుతున్నారు. ‘అమ్మవారికి పచ్చడి నైవేద్యంగా పెట్టడం ఉపాసనకే సాధ్యమైంది. ఎందుకంటే, ఉపాసన చేసి మరీ పెట్టింది కాబట్టి. అందుకే అంటారు స్వామి కార్యం, స్వకార్యం రెండూ ఒక్కసారే. తెలివైన కోడలు ఉపాసన..’ అని ఒక నెటిజన్ అంటే, ‘అత్తమ్మ వంటలు ప్రమోట్ చేస్తున్న కోడలు, ఇది అత్తాకోడళ్ల అనుబంధం. అది ఆవకాయ పచ్చడి అయినా, మన సాంప్రదాయం అయినా’ అని మరో నెటిజన్ అన్నారు. ఇక కొందరు అత్తమ్మాస్ కిచెన్‌లో లభించే ఈ ఆవకాయ పచ్చడి కాస్ట్‌పై కామెంట్ చేశారు. ఇందులో మీరు ఏమైనా బంగారం వేసి చేస్తున్నారా? ఒక కేజీ పచ్చడి రూ. 1700 అంటే ఎవరు కొంటారు? అని ఓ నెటిజన్ ప్రశ్నించారు. మొత్తంగా అయితే ఈ కామెంట్స్‌తో ఉపాసన చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Also Read- Hit 3 Review: బాబోయ్ ఇదేం ఊచకోత.. ‘హిట్ 3’ ఎలా ఉందంటే..

ఈ మధ్య అలేఖ్య చిట్టి పచ్చళ్ల కాంట్రవర్సీ గురించి తెలిసిందే. కానీ, వారు ప్రమోట్ చేసిన విధానంలోనూ, ఉపాసన ప్రమోట్ చేసే విధానంలో ఎంత తేడా ఉందో గమనించవచ్చు. పాపం ఇది తెలియక.. వారు తమ వ్యాపారాన్ని రచ్చ రచ్చ చేసుకున్నారని కొందరు సరదాగా కామెంట్స్ చేస్తుండటం విశేషం. ఇదిలా ఉంటే, మన ఇంట్లో మొదటిసారి లభించే ఏ పంట, పండునైనా దేవుడి ముందు పెట్టిన తర్వాతే మనం తీసుకుంటాం. అదే సంస్కృతి మెగాస్టార్ ఇంట్లో పచ్చడికి సైతం జరుపుతుండటం నిజంగా గొప్ప విషయంగా చెప్పుకోవాలి. ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ మరోసారి అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. అన్నదమ్ముల అనుబంధం విషయంలో ఎంతో మందిని, ఆఖరికి ప్రధాని మోదీ కళ్లు కూడా చెమర్చేలా చేసిన మెగా ఫ్యామిలీ, ఇలాంటి విషయాలలో సైతం ఎప్పుడూ స్ఫూర్తినిస్తూనే వస్తుందని చెబుతూ మెగా ఫ్యాన్స్ ఈ వీడియోని షేర్ చేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!