Waves Summit 2025
ఎంటర్‌టైన్మెంట్

Waves Summit 2025: ‘వేవ్స్ 2025’.. అతిరథమహారధుల సమక్షంలో అతి పెద్ద వినోద కార్యక్రమం ప్రారంభం

Waves Summit 2025: అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన అతి పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ ఈవెంట్ ‘వరల్డ్‌ ఆడియో విజువల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌’ (Waves Summit 2025). మే 1 నుంచి 4 వరకు జరిగే ఈ కార్యక్రమంలో గురువారం ముంబై వేదికగా గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఒక్క ఇండియన్‌ సినిమాల గురించి మాత్రమే కాదు.. ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోని పలు విభాగాలకు సంబంధించిన విషయాలపై చర్చించే వేదికగా ‘వేవ్స్‌ 2025’ ఉండబోతుంది. ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి చర్చించనున్నారు. ఆయనతో పాటు వేవ్స్‌ అడ్వైజరీ బోర్డు సభ్యులైన ప్రముఖ సెలబ్రిటీలెందరో ఈ కార్యక్రమంలో పాల్గొన్ని వారి సలహాలను, సూచనలను అందించనున్నారు. వేవ్స్‌ అడ్వైజరీ బోర్డు సభ్యులుగా ఇప్పటికే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలలోని సెలబ్రిటీలెందరినో ఎంపిక చేసి, వారితో పలుమార్లు ప్రధాని చర్చించిన విషయం తెలిసిందే.

Also Read- Hit 3 Review: బాబోయ్ ఇదేం ఊచకోత.. ‘హిట్ 3’ ఎలా ఉందంటే..

నాలుగు రోజుల పాటు జరిగే ఈ వేవ్స్ 2025 సమ్మిట్ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, మోహన్ లాల్, ఎస్ఎస్. రాజమౌళి, షారుఖ్, ఆమిర్, అక్షయ్ కుమార్, ఐశ్వర్యరాయ్ వంటి ప్రముఖులెందరో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఉన్న జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతుంది. ఈ సమ్మిట్ నాలుగు రోజులు కార్యక్రమ వివరాలిలా ఉన్నాయి. ఈ కార్యక్రమం గురువారం మధ్యాహ్నం ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైన అనంతరం ‘లెజెండ్స్ అండ్ లెగసీస్’: ది స్టోరీస్ దట్ షేప్డ్ ఇండియాస్ సోల్’ అనే చర్చా కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో రజనీకాంత్, చిరంజీవి, మోహన్ లాల్, హేమ మాలిని, మిథున్ చక్రవర్తి వంటివారు పాల్గొననున్నారు. ఈ సెషన్‌ను అక్షయ్ కుమార్ నిర్వహించనున్నారని తెలుస్తోంది.

అనంతరం ‘ది న్యూ మెయిన్ స్ట్రీమ్: బ్రేకింగ్ బోర్డర్స్, బిల్డింగ్ లెజెండ్స్’ అనే అంశంపై మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానున్న సెషన్‌ను బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ నిర్వహిస్తారని, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్, నటులు అనిల్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ వంటి వారు ఈ సెషన్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. ఆ తర్వాత జరిగే ‘ది జర్నీ: ఫ్రమ్ అవుట్‌ సైడర్ టు రూలర్’ అనే సెషన్‌లో కరణ్ జోహార్ మోడరేటర్‌గా నటులు షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. ‘టాలెంట్ బియాండ్ బోర్డర్స్’ అనే ప్యానెల్ చర్చలో అల్లు అర్జున్ పాల్గొంటారని తెలుస్తోంది. ఈ సెషన్ మే 2న సాయంత్రం జరగనుంది.

Also Read- Single Controversy: ‘కన్నప్ప’కు సారీ చెప్పారా? చెప్పించారా? కాంట్రవర్సీ‌కి ఫుల్ ‌స్టాప్ పడినట్టేనా!

ఇంకా ది లెజండ్ మనోజ్ కుమార్ వారసత్వాన్ని చర్చించే సెషన్ కూడా ఉండనుంది. ఇందులో హేమ మాలిని, దర్శకుడు మధుర్ భండార్కర్ వంటి వారు ఆయన రచనల గురించి మాట్లాడనున్నారు. ఈ ప్యానెల్ చర్చలతో పాటు ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గాయకులు శ్రేయ ఘోషల్, శంకర్ మహదేవన్, సోను నిగమ్, కెఎస్ చిత్ర, మంగ్లీ వంటి వారితో మ్యూజికల్ ఈవెంట్స్ ఉండనున్నాయి. ఆ మరుసటి రోజు పండిట్ విశ్వ మోహన్ భట్, రోను మజుందార్, బ్రిజ్ నారాయణ్ వంటి ఇతర గొప్ప వ్యక్తులు ప్రేక్షకుల కోసం ప్రదర్శన ఇస్తారని తెలుస్తోంది. మొత్తంగా అయితే ఇండియన్ హిస్టరీలో ఇప్పటి వరకు జరగని ఓ భారీ ఈవెంట్‌గా ఈ సమ్మిట్‌ను ప్లాన్ చేశారు. దాదాపు 90కి పైగా దేశాల నుంచి 10 వేల మందికి పైగా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

అలాగే రీసెంట్‌గా జరిగిన క్రియేట్ ఇండియా అనే ఛాలెంజ్‌లో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి ఈ కార్యక్రమంలో మోడీ అవార్డులు అందించనున్నారు. కేవలం సెలబ్రిటీలే కాకుండా పారిశ్రామిక వేత్తలెందరో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ప్రస్తుతం రజనీకాంత్, చిరంజీవి, మోహన్ లాల్, హేమమాలిని, మిథున్ చక్రవర్తి, అక్షయ్ కుమార్ వంటి వారు ఈ కార్యక్రమంలో సందడి చేస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?