Jagityal Crime(image credit:AI)
తెలంగాణ

Jagityal Crime: పేగుబంధం పెనుశాపమై.. కన్నతల్లిని అడవిలో వదిలేసిన కూతురు..

Jagityal Crime: నవ మాసాలు మోసి, కని పెంచి కూతురు బాగుండాలని కోరుకుంది ఆ వృద్దురాలు, వృద్దాప్యంలో తోడుంటుందనుకుంది, కానీ తల్లీ ప్రేమకన్న డబ్బే ముఖ్యమని కర్కశంగా ప్రవర్తించి దట్టమైన అడవిలో వదిలేసింది, అమ్మవద్ద ఉన్న బంగారాన్నీ లాక్కుని పారిపోయింది, తాను ఎక్కడ ఉన్నానో తెలియకా ఆ వృద్దురాలు రెండు రోజులుగా తిండితిప్పలు లేకా అపస్మారక స్థితికి చేరుకున్న ఘటన జగిత్యాల జిల్లా లో చోటుచేసుకుంది.

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇస్లాంపురా వీధిలో నివాసముంటున్న బుధవ్వ, ఈశ్వరి తల్లీ కూతుళ్లు, కూతురుకోసం తల్లీ నానా కష్టాలుపడి పోషించింది‌. అయితే గత రెండు రోజుల క్రితం ఈశ్వరికి తల్లిపై ఉన్న బంగారు ఆభరణాలపై కన్ను పడింది. ఎలాగైనా ఆ బంగారం చేజిక్కించుకోవాలని ఉద్దేశంతో గొల్లపల్లి మండలం శ్రీరాముల పల్లె గ్రామ శివారులోని దట్టమైన అడవి వద్దకు తీసుకెళ్లింది.

Also read: Heavy Rains In TG: రాష్ట్రంలో మోస్తారు వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!

అక్కడ బుధవ్వ మెడల నుండి బంగారు ఆభరణాలను లాక్కుంది, దట్టమైన అడవిలో వదిలేసి కనిపించకుండా వెళ్లిపోయింది. అసలు తాను ఎక్కడ ఉందో తెలియలేని బుధవ్వ అదే ప్రాంతంలో గత రెండు రోజులుగా తిరుగుతూ తిండి తిప్పలు నీరు లేక అపస్మారక స్థితికి చేరుకుంది. అటుగా వెళుతున్న యువకులు ఆమెను గమనించి జిల్లా సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

వెంటనే శ్రీరాముల పల్లెలోని సఖి కేంద్రానికి ఆమెను తరలించారు అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బుధవ్వ, పరిస్థితి విషమంగా ఉంది. జీవిత చరమాంకంలో తల్లిని సాకాల్సిన బిడ్డ కర్కశంగా మారి తల్లిపై ఉన్న బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లి అడవిలో వదిలి వెళ్ళడం పలువురిని కంటతడి పెట్టించింది.

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు