Heavy Rains In TG(image credit:X)
తెలంగాణ

Heavy Rains In TG: రాష్ట్రంలో మోస్తారు వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!

Heavy Rains In TG: తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు నుంచి నాలుగు రోజులపాటు 21 జిల్లాలలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో అల్పపీడన ద్రోణి ఏర్పడటంతో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

రాష్ట్రవ్యాప్తంగా గంటకు దాదాపు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, యాదాద్రి భువనగిరి, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి 17 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

Also read: Telangana Govt: మారుమూల పల్లెలకు మహర్దశ.. సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వాతావరణం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపింది. పలు ప్రాంతాల్లో బుధవారం తేలికపాటి చిరుజల్లులు కురిసాయి.

పలుచోట్ల వర్షాలు

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణాలో వరంగల్, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది.
ఓవైపు రాష్ట్రంలో వాతావరణం అంతా చల్లబడ్డా.. ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల్లో మాత్రం 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు