Ponnam Prabhakar (imagecredit:swetcha)
తెలంగాణ

Ponnam Prabhakar: సమ్మె వద్దు మాకు సహకరించండి.. మంత్రి పొన్నం!

తెలంగాణ: Ponnam Prabhakar: ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నామని రవాణా, బీసీ సంక్షేమ శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే గాడిన పడుతుంది సమ్మె వద్దు అని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే గాడిన పడుతుంది లాభాల బాట పడుతుందని తెలిపారు. సికింద్రాబాద్ తిరుమలగిరి ఆర్టీవో కార్యాలయంలో సారధి పోర్టల్ ను, ఆధునీకరించిన ఆర్టీవో కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. అగ్నివీర్ లకు లైసెన్స్ లతో పాటు హెల్మెట్ లు అందించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏ సమస్య అయినా పరిష్కారం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆర్టీసీ కార్మికుల పోరాటంతో తెలంగాణ సాధించబడిందన్నారు. తెలంగాణ సాధించిన తరువాత 10ఏళ్లు ఏం జరిగిందో చూశామని, బీఆర్ఎస్ ఆర్టీసీని నిర్వీర్యం చేసిందన్నారు. ఇప్పుడు కారుణ్య నియామకాలు చేపట్టాం , ఆర్టీసీ తార్నాక ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ గా మార్చి అందరికి అందుబాటులోకి తెచ్చామన్నారు. కార్మికుల పెండింగ్ బకాయిలు టీఏ, డీఏలు ఇచ్చామన్నారు.

కొత్త నియామకాలు చేపడుతున్నాం, కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామన్నారు. కార్మికుల సంక్షేమం ఆర్టీసీ సంస్థ పరిరక్షణగా ముందుకు పోతున్నామన్నారు. సమ్మెకు పోవడం వల్ల ఇబ్బందులు వస్తాయన్నారు. వారి రెండు ప్రధాన అంశాలు ముఖ్యమంత్రి నోటీసులో ఉన్నాయని, వాటిని కూర్చొని మాట్లాడుకుందామన్నారు. ట్రేడ్ యూనియన్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఇది సమ్మెకు పోయే కాలం కాదు ఆర్టీసీ శ్రేయస్సు దృష్ట్యా ఇది సమ్మె సమయం కాదు అన్నారు.

Also Read: Kaleshwaram project: బీఆర్ఎస్ నేతల అవినీతి, కక్కుర్తితో కాళేశ్వరం ఆగమాగం.. మండిపడిన మంత్రి!

రిటైర్మెంట్ అయిన రోజే వారి బెనిఫిట్స్ ఇవ్వాలని కార్యాచరణ చేస్తున్నామన్నారు. బ్యాంకుల్లో బకాయిలు ఉన్నాయి సంస్థ నిలబడాలన్నారు. ఆర్టీసీ 40వేల కుటుంబాలు బాగుపడాలని కోరుకునే ప్రభుత్వం అన్నారు. సంస్థను ప్రజా పాలన ప్రభుత్వం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సానుకూల దృక్పథంతో ముందుకు పోతున్నామని, నిరంకుశత్వంతో పోవడం లేదన్నారు. ఆర్టీసీ సమ్మె పునరాలోచన చేయాలని కోరారు. సహృద్భవ సంబంధాలతో ఆర్టీసీని రక్షించుకోవాలి మీరంతా నా కుటుంబ సభ్యులు ఆర్టీసీ సమ్మె వద్దు మీకు విజ్ఞప్తి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

సారధి పోర్టల్ తో దేశ రవాణా చట్టానికి సంబంధించిన సమాచారం లోపల మనం కూడా అంతర్భాగం అయ్యామన్నారు. రవాణా పరమైన మార్పులు నిర్ణయాలు వాహనాల సమాచారం ,రవాణా శాఖ కు సంబంధించిన మొత్తం సమాచారం మన దగ్గర తెలుసుకునే అవకాశం ఉందన్నారు. గతంలో తెలంగాణకి వాహన సారధి సభ్యులుగా చేరడం వల్ల రవాణా అంశాల్లో దేశంలో భాగస్వామ్యులం అయ్యామని తెలిపారు. రవాణా శాఖ రూల్స్ పట్ల ఆవాహన కలిగేలా కార్యక్రమాలు చేపట్టామన్నారు.

రోడ్ సేఫ్టీ అవేర్నెస్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి పాఠశాలలో స్కూల్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మారుతున్న సాంకేతిక విప్లవం లో రోడ్ నిబంధనలు పాటించకపోతే లైసెన్స్ లు రద్దు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈవీవాహనాలకు జీరో టాక్స్ చేశామన్నారు. వందల కోట్లు నష్టం వచ్చిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇబ్బంది కలగద్దని ఈవీ పాలసీ తీసుకొచ్చామని తెలిపారు.

Also Read: Minister Seethaka: ఆదివాసీలకు ప్రత్యేక హక్కులు ఉంటాయి.. మంత్రి సీతక్క!

రవాణా శాఖ సేవలు ఆన్లైన్ అందించడం ద్వారా మధ్యవర్తి లేకుండా పారదర్శకంగా అందిస్తుందన్నారు. రోడ్డు ప్రమాదాల రహిత తెలంగాణగా మారుస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ , రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్ ,రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి ,జేటీసీలు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, శివలింగయ్య, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?