Na Anveshana: నా అన్వేషణ అన్వేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను ప్రస్తుతం, బెట్టింగ్ యాప్స్ పైన పోరాటం చేస్తున్నాడు. గత కొన్ని నెలల నుంచి బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసే వాళ్ళ గురించి వీడియోస్ పెడుతూ పాపులారిటీని సంపాదించుకున్నాడు. చిన్న సెలబ్రిటీల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవర్ని వదలకుండా అందరివి వీడియోస్ పెడుతున్నాడు.అయితే, ఇప్పుడు బాలీవుడ్ లో కూడా భారీ ఎత్తున బెట్టింగ్ స్కామ్స్ జరిగాయంటూ సంచలన వీడియో రిలీజ్ చేశాడు.
అన్వేష్ మాట్లాడుతూ ” టాలీవుడ్ బెట్టింగ్ స్కామ్ కి మించిపోయిన బాలీవుడ్ బెట్టింగ్ స్కామ్స్ జరిగాయి. వామ్మో ఒకటి కాదు, రెండు కాదు అక్షరాల 17 వేల కోట్లు దోచుకున్నారు. ప్రస్తుతం, ఈ వార్తా న్యూస్ ఛానెల్స్ లో మారు మోగిపోతోంది. 17 రూపాయలు కాదు, 17 వేల కోట్లు రా నాయనా వామ్మో ఇంత డబ్బా.. జస్ట్ రెండు రోజుల్లో తీసుకెళ్లిపోయారు.దీనిలో వంద మంది బడా స్టార్స్ ఉన్నారు. ఓరి బాబోయ్ వంద కోట్లు అంటే వదిలేయోచ్చు. వెయ్యి కోట్లు అంటే పోనిలే అనుకోవచ్చు. 17 వేల కోట్లు ఎలా వదిలేయలి. ఇది ఒక్కటే కాదని ” అన్నాడు.
” మన దగ్గర చాలానే ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే కొన్ని వందలు బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. అయితే, వీటిలో GST నెంబర్ ఉండదు. టాక్స్ ఉండదు .. ఆన్లైన్ లో డబ్బులు పెట్టండి.. వదిలించుకోండి. ఇదే వాళ్ళ ఫార్ములా. ఇవి చిన్నవే .. వీటి కన్నా ఇంకా పెద్ద స్కామ్స్ కూడా ఉన్నాయి. అవి అయితే అన్నీ 10 వేల కోట్లు స్కామ్స్.. ప్రస్తుతం, ఐపీఎల్ జరుగుతుంది కదా .. దీనిలో ఆడే బెట్టింగ్ యాప్స్ కి డైరెక్ట్ లింక్ అటాచ్ చేశాడు. అందరూ ఇదే ఒరిజినల్ అనుకుని చాలా మంది బెట్టింగ్ వేశారు. మొత్తం డబ్బు మొత్తం పోయింది. ఒక్క పది రోజుల్లోనే డబ్బులు బాగా సంపాదించారని ” అన్నాడు.
అతను ఇంకా మాట్లాడుతూ ” మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని ఏరుతున్నాము. ఇంకా ఇది హిందీ వరకు వెళ్ళలేదు. ఈ 17 వేల కోట్లను నాలుగు కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ చేశారు. 13 వేల కోట్లను నాలుగు కంపెనీల చేస్తే, మిగతా నాలుగు వేల కోట్లను ఆన్లైన్ ద్వారా పంపించారు. వాటిలో ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో కూడా లిస్ట్ అయింది. ఇంత జరుగుతున్నా కూడా ఎవరూ సీరియస్ గా తీసుకోలేదని అన్నాడు.
డబ్బులు వెళ్లిపోయాక వాటిలో కేవలం రూ. 300 కోట్లను మాత్రమే సీజ్ చేశారు. కానీ, ఇప్పుడు ఇది చేసి ఏం లాభం. అంటే నా ఉద్దేశం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఏం లాభం అని అంటున్నాను. ఇన్ని బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. ప్రమోట్ చేసే వారిని పట్టుకుని కౌన్సిలింగ్ ఇస్తే ఇవి జరగకుండా ఉంటాయి కదా.. ఇప్పటికీ 55 రోజులు అయింది. ఇప్పుడిప్పుడే బెట్టింగ్ యాప్స్ పైన అవగాహన వస్తుందని తన మాటల్లో మొత్తం బయటకు వెల్లడించాడు.