Kaleshwaram project: కాళేశ్వరం కమిషన్ గడువును ప్రభుత్వం మరోసారి పెంచింది. దీంతో ఐదోసారి గడువు పెంచినట్లు అయింది. ఈ నెల 30తో కమిషన్ గడువు ముగుస్తుండటంతో ప్రభుత్వం మరో నెల రోజులు మే31 వరకు పెంచింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలను తేల్చేందుకు 2024 మార్చి 14న సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జీ సీపీ ఘోష్ చైర్మన్ గా ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది.
100 రోజుల్లో విచారణ పూర్తి చేయాలనే లక్ష్యంతో కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ విచారణ తుదిదశకు చేరింది. ఇప్పటివరకు 100 మందికి పైగా అధికారులను, ఇంజనీర్లకు, నిపుణులను విచారింది. 90శాతం పూర్తైనట్లు సమాచారం. దాదాపు 400 పేజీలకు పైగా నివేదికను సిద్ధం చేసింది. మే రెండో వారం లోగా పూర్తి నివేదికను సిద్ధం చేయనున్నట్లు సమాచారం.
Also read: Kaleshwaram project: బీఆర్ఎస్ నేతల అవినీతి, కక్కుర్తితో కాళేశ్వరం ఆగమాగం.. మండిపడిన మంత్రి!
అయితే అనుకున్న సమయంలో కమిషన్ విచారణ పూర్తి కాకపోవడంతో గత ఏడాది ఆగస్టు28 న ప్రభుత్వం గడువు పెంచింది. నవంబర్ 12న మరోసారి, డిసెంబర్ 21న, తిరిగి ఈ ఏడాది ఫిబ్రవరి 20న, తాజాగా మే 31 వరకు గడువు పెంచింది. మొత్తం 5సార్లు కమిషన్ గడువును ప్రభుత్వం పెంచింది. అయితే వచ్చే నెలలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నకేసీఆర్, హరీష్ రావుతో పాటు ఈటలను సైతం విచారించనున్నట్లు సమాచారం.