Kaleshwaram project(image credit:X)
తెలంగాణ

Kaleshwaram project: బీఆర్ఎస్ నేతల అవినీతి, కక్కుర్తితో కాళేశ్వరం ఆగమాగం.. మండిపడిన మంత్రి!

Kaleshwaram project: బీఆర్ఎస్ నేతల నిర్లక్ష్యం, కక్కుర్తి, అవినీతితోనే కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాకుండాపోయిందని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. కాళేశ్వరం కూలిన పాపం ముమ్మాటికీ గత బీఆర్ఎస్ పాలకులదే నని అన్నారు. చేసిన నిర్వాకం చాలదన్నట్లు అసలు విషయాన్ని దృష్టి మరల్చేందుకు ఆ పార్టీ అసత్య ప్రచారానికి పూనుకుందని మండిపడ్డారు. సచివాలయంలో మంగళవారం ఎన్డీఎస్ఏ వెల్లడించిన నివేదికపై మీడియా సమావేశం నిర్వహించారు. జాతీయ ప్రాజెక్టుల భద్రత సంస్థ వెల్లడించిన నివేదిక పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రలోనే కాళేశ్వరం కూలిన దురదృష్టకర సంఘటన నిలిచి పోతుందన్నారు. ఇంజినీరింగ్ వైఫల్యానికి ఇదో పరాకాష్ట అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో నిర్మించిన ప్రాజెక్టు వారి పాలనలోనే కూలి పోయిందన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నిర్మాణపరంగా అన్నీ లోపాలే ఉన్నాయని ఎన్​డీఎస్​ఏ రిపోర్టు స్పష్టం చేసిందన్నారు. కాళేశ్వరంను రూ.80 వేల కోట్లతో నిర్మిస్తామని చెప్పి.. రూ.లక్ష కోట్లు అప్పు చేశారని మండిపడ్డారు.

అడుగడుగునా లోపాలున్న ప్రాజెక్టు కోసం రకరకాల కార్పొరేషన్లతో గత బీఆర్​ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైకాస్ట్​ రుణాలకు ప్రస్తుతం రూ.16 వేల కోట్ల మేర వడ్డీలు, ఇన్​స్టాల్​మెంట్లను కడుతున్నామని చెప్పారు.ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతో పాటు తెలంగాణా రైతాంగానికి మోయలేని భారంగా మారిందన్నారు.

Also read: Simhachalam Tragedy: సింహాచలం విషాదం.. సాఫ్ట్ వేర్ దంపతులు సహా ఫ్యామిలీలో నలుగురు మృతి

కేసీఆర్ పాలనలో ఉద్దేశపూర్వకంగానే ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలకు పాల్పడ్డారని, అడుగడుగునా అసమర్థ విధానాలు, నిర్లక్ష్యంతో వ్యవహరించారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును శాస్త్రీయంగా నిర్మించలేదని, అబద్ధాలు, అసత్యప్రచారాలతోనే నిర్మించారని విమర్శించారు. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ పాలకులు చేసిన అప్పులు మూడు తరాలకు భారంగా పరిణమించగా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందన్నారు.

ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం భద్రతా ప్రమాణాలు పాటించక పోగా ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డట్లు తెలిపోయిందన్నారు. 2019 నుండే నీళ్లు కారడం, పగుళ్లు ఏర్పడడం జరిగినా నాటి ప్రభుత్వం పట్టించుకోక పోవడంతోటే ఇప్పుడూ ఈ పరిస్థితి దాపురించి కోట్లాది ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.

వాస్తవానికి తుమ్మిడిహట్టి దగ్గర నిర్మించాల్సిన ఈ ప్రాజెక్టును రీ డిజైన్ పేరుతో నిర్మించిన ప్రాజెక్టు ఏ రకంగా కూలిపోయిందన్న విషయాన్ని ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం కాకుండా పబ్లిసిటీ కోసం బీఆర్ఎస్ పాలకులు తహ తహ లాడరని దాని ఫలితమే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా పరిణమించిందన్నారు.

2 టీఎంసీల నీటి సామర్థ్యంతో రూపొందించిన బ్యారేజీ లలో 10 టీఎంసీల పై బడి నీటిని నిలువ చేసి పబ్లిసిటీ పబ్బం గడుపుకోవాలని చూసిన బీఆర్ఎస్ పాలకులకు వారి పాలన కూలిపోవడం వారి పరిపాలనా వైఫల్యాలను బహిర్గతం చేసిందన్నారు. ఫలితంగా ఫౌండేషన్​కు డ్యామేజ్​ జరిగి బ్యారేజ్​ కుంగిపోయిందని అన్నారు. సేఫ్టీ ప్రొటోకాల్స్​ ఏమాత్రమూ పాటించలేదంటూ ఎన్​డీఎస్​ఏ రిపోర్టులో తేల్చి చెప్పిందన్నారు.

బ్యారేజీలకు చేసిన బోర్​హోల్స్​ డేటా సరిగ్గా లేదని, మెయింటెనెన్స్​ రికార్డులు లేవని మండిపడ్డారు. బ్యారేజీల నిర్మాణం పూర్తయ్యాక 2019లోనే తొలిసారిగా సీపేజీలు వచ్చాయని, కానీ, బీఆర్​ఎస్​ ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదని ఆయన అన్నారు. తెలంగాణకు రూ.వేల కోట్ల నష్టం చేసిన వారి పని నేరపూరిత నిర్లక్ష్యమని మండిపడ్డారు. తమ్మిడి హట్టి వద్ద నీటి సౌలభ్యత లేదని బీఆర్ఎస్ పాలకులు తప్పుడు ప్రచారం చేశారని అది ముమ్మాటికీ సత్యదూరమన్నారు.

Also read: Star Heroine: నన్ను ఒంటర్ని చేశారు.. నాతో ఎవరూ లేరు.. చాలా బాధ పడ్డా..

చేసిన తప్పును కేసీఆర్​ ఒప్పుకోకుండా.. రివర్స్​లో ఎన్​డీఎస్​ఏ విశ్వసనీయతపైనే ఎదురుదాడి చేయడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్​ నిర్ణయాలతో తెలంగాణకు భారీ అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. కేసీఆర్​ నిర్ణయాల ఫలితంగా దేశం ముందు తెలంగాణ విశ్వసనీయత దెబ్బతిన్నదన్నారు.

ఇరిగేషన్​ శాఖను మొత్తం ధ్వంసం చేశారని ఆరోపించారు. సీతారామసాగర్​ ప్రాజెక్టుకు క్లియరెన్సుల కోసం ఇటీవల కేంద్ర జలశక్తి శాఖతో సమావేశమైతే.. రాష్ట్రంలో ఇరిగేషన్​ శాఖ కుప్పకూలిందంటూ చెప్పారని, ప్రాజెక్టుకు అనుమతులివ్వలేమన్నారని అన్నారు. గత ప్రభుత్వం చేసిన పొలిటికల్​ స్టంట్​తో ప్రజాధనం దుర్వినియోగం అయిందన్నారు.బ్యారేజీల డీపీఆర్​లు సిద్ధం కాకముందే పనులను చేపట్టారని ఆరోపించారు.

డీపీఆర్​లలో పేర్కొన్న ఒరిజినల్​ వర్క్​ స్కోప్​ ఒకటని, కానీ, బయట చేసిన పనులు వేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ స్థలాలను వ్యక్తిగతంగా మార్చేశారని, ఎలాంటి చర్చలు లేకుండానే ఉన్నపళంగా మార్చారని విమర్శించారు. కొత్త స్థలాల వద్ద జియోటెక్నికల్​ ఇన్వెస్టిగేషన్స్​ చేయలేదని ఎన్​డీఎస్​ఏ క్లియర్​గా చెప్పిందని గుర్తు చేశారు.

సీడబ్ల్యూసీ వద్ద డీపీఆర్​లలో ఒక స్థలముంటే.. నిర్మాణ స్థలాల మార్పు విషయం కూడా సీడబ్ల్యూసీకి చెప్పలేదని విమర్శించారు. కాళేశ్వరం విపత్తు సహజసిద్ధంగా జరగలేదని, బీఆర్​ఎస్​ పాలనలో తీసుకున్న నిర్ణయాల వల్లే ఆ ప్రాజెక్ట్​ కుంగిపోయిందని మండిపడ్డారు.

ఎన్డీఎస్ఏ అనేది పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడిందని, చట్టం చేసినప్పుడు బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు ఇచ్చారన్నారు. బ్యారేజీల భద్రతపై ఎన్డీఎస్ఏ అత్యున్నతబోర్డు అని, దేశంలోని 700 బ్యారేజీల భద్రతను పరిశీలిస్తోందన్నారు. వివిధ అంశాల్లో అంతర్జాతీయ స్థాయి నిపుణులతో ఈ బోర్డు ఏర్పటైందని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి మట్టి పరీక్షలు, నాణ్యత పరీక్షలు చేయలేదన్నారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ సీపేజీ ఉందని ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిందన్నారు. సీడబ్య్లూసీ కి ఇచ్చిన డీపీఆర్ లో కూడా తర్వాత ఇష్టారాజ్యంగా మార్పులు చేశారన్నారు.

కేసీఆర్ ఎలా చెప్పే అలా నిర్మించారని మండిపడ్డారు.ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించాలనుకున్న తుమ్మడిహెట్టి వద్ద నీళ్లే లేవని గత బీఆర్​ఎస్​ పాలకులు అబద్ధాలు చెప్పారన్నారు. అక్కడ నీటి లభ్యత ఉందని సీడబ్ల్యూసీ చెప్పిందన్నారు. కానీ, కమీషన్ల కోసం ప్రాజెక్టును రీడిజైన్​ చేసి అంచనాలు అమాంతం పెంచి ప్రజాధనాన్ని వృథా చేశారన్నారు.

ఇరిగేషన్​ వ్యయాల కింద రూ.1.81 లక్షల కోట్లకుపైగానే ఖర్చు చేశారన్నారు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు లేకున్నా ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో ధాన్యం పండిందని అన్నారు. వీలైనంత త్వరగా బ్యారేజీ స్టెబిలైజేషన్​, రిపేర్లు, రీహాబిలిటేషన్​ పనులను చేపట్టాల్సిందిగా ఎన్​డీఎస్​ఏ సిఫార్సు చేసిందన్నారు.

Also read: Minister Seethaka: ఆదివాసీలకు ప్రత్యేక హక్కులు ఉంటాయి.. మంత్రి సీతక్క!

ఈ విషయంలో ఎక్స్​పర్టులతో సాంకేతికంగా విశ్లేషించాల్సిన అవసరం ఉందని చెప్పారు. బ్యారేజీలను రీస్టోర్​ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటామని స్పష్టం చేశారు. కేబినెట్​లో చర్చించిన తర్వాత దీనిపై తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. చట్టప్రకారమే ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆదేశాలిచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుకు కారణమైనవాళ్లను కచ్చితంగా బాధ్యులను చేస్తామన్నారు.

వాటర్ మేనేజ్మెంట్,ల్యాండ్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ వంటి సాంకేతిక శిక్షణా సంస్థను బలోపేతం చేసే ఇంజినీర్లకు శిక్షణ ఇవ్వబోతున్నామన్నారు. తుమ్మడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి ఫీజిబిలిటీపై ఇరిగేషన్​ శాఖ సలహాదారు ఆదిత్యనాథ్​ దాస్​ రివ్యూ చేస్తున్నారని తెలిపారు. బీఆర్​ఎస్​ పాలనలో జరిగిన మోసాలు మరోసారి పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిన ఘటనపై ప్రస్తుతం జ్యుడీషియల్​ కమిషన్​ విచారణ చేస్తుందని, ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని అన్నారు.ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ,ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే సత్యనారాయణ, నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆర్అండ్ఆర్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, ఇ. ఎన్.సీ అనిల్ కుమార్ పాల్గొన్నారు.

Just In

01

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!