Star Heroine: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి తొందరగా సక్సెస్ రాదు. ఒక సినిమా హిట్ అయిన తర్వాత ఇంకో మూవీ హిట్ కాకపోతే ట్రోల్స్ చేస్తారు. ఆ లిస్ట్ లో యంగ్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. మొదట్లో శ్రీలీల కూడా అంతే.. మొదటి మూవీ తర్వాత వచ్చిన సినిమాలన్నీ భాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఆమెను ట్రోలర్స్ చేయడం మొదలు పెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. అయితే, ఇప్పుడు చెప్పుకోబోయే హీరోయిన్ కూడా తన కెరీర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులు పడింది. కానీ, ఇప్పుడు మాత్రం వరుస హిట్స్ తో దూసుకెళ్తుంది. ఆమె ఎవరో ఇక్కడ తెలుసుకుందాం..
‘ఇచట వాహనములు నిలుపరాదు’ అనే మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి చౌదరి, తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది. డెబ్యూ ఫిల్మ్ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు, ఆమె నటనతో అండర్ని మెప్పించి ఏకంగా స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసి, సినీ కెరీర్ లో రాకెట్ వేగంతో దూసుకెళ్లింది.
అయితే, రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తను ఎదుర్కొన్న సమస్యలను గురించి చెబుతూ చాలా ఎమోషనల్ అయింది. చిన్నప్పుడు నాతో ఎవరూ ఉండే వాళ్ళు కాదు. ఆ సమయంలో అందరూ దూరమయ్యారు, ఒంటర్ని అయ్యా అంటూ చెప్పింది. వాళ్ళు అలా చేసేసరికి అందరితో కలిసి సరదాగా మాట్లాడాలన్నా చాలా ఇబ్బందిగా ఉండేదని అన్నది. ముఖ్యంగా, నేను చదువుకునే సమయంలో దీని వలన డిప్రెషన్ కి కూడా వెళ్ళా.. అలాగే నా ఎత్తు కూడా నన్ను ఇబ్బంది పెట్టింది అంటూ చెప్పుకొచ్చింది. అప్పట్లోనే 6 అడుగుల 2 అంగుళాలు ఉండేదాన్ని, నా స్నేహితులు నా దగ్గరకు కూడా వచ్చే వాళ్ళు కాదు అంటూ ఎమోషనల్ అవుతూ ఆమె మాటల్లో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం, దీనికి సంబందించిన వీడియో తెగ వైరల్ అవుతుంది.