HC on TG Electricity(imagecredit:twitter)
తెలంగాణ

HC on TG Electricity: ఆ సంస్థల్లో పదోన్నతులు నిలిపివేత.. ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు!

తెలంగాణ: HC on TG Electricity: విద్యుత్​ సంస్థల్లో పదోన్నతులను నిలిపి వేస్తూ హైకోర్టు జస్టిస్​ నామవరపు రాజేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. విద్యుత్​ సంస్థలైన ట్రాన్స్​ కో, జెన్​ కో, ఎస్పీడీసీఎల్​, ఎన్పీడీసీఎల్​ సంస్థల్లో హైకోర్టు, సుప్రీం కోర్టు, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను లెక్క చేయకుండా అడ్​ హక్​ పద్దతిలో యాజమాన్యాలు పదోన్నతులు ఇస్తున్నాయంటూ తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం, బీసీ, ఓసీ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితిల ప్రతినిధులు హైకోర్టులో కొంతకాలం క్రితం పిటిషన్లు దాఖలు చేశారు.

దీని వల్ల రాష్ట్రం ఆవిర్భవించిన 2014, జూన్​ 2వ తేదీ నుంచి ఇచ్చిన పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు సీనియారిటీ ప్రకారం న్యాయంగా దక్కాల్సిన ప్రమోషన్లు దక్కకుండా పోయాయని పేర్కొన్నారు. దీనిపై పిటిషనర్ల తరపు న్యాయవాది గోడ శివ వాదనలు వినిపిస్తూ హైకోర్టు, సుప్రీంకోర్టు, రాష్ట్రప్రభుత్వ ఉత్తర్వులను ఖాతరు చేయకుండా అడ్​ హక్​ పద్దతిలో ఇచ్చిన పదోన్నతుల వల్ల వందలాది మంది బీసీ, ఓసీ ఉద్యోగులకు ప్రమోషన్లు రాకుండా పోయాయని తెలిపారు.

Also Read: BRS BJP Alliance: బీజేపీ – బీఆర్ఎస్ పొత్తు.. సభ వేదికగా కేసీఆర్ హింట్స్.. టార్గెట్ హైదరాబాద్!

కాలపరిమితితో కూడిన ఉత్తర్వులు జారీ చేస్తే తప్ప పదోన్నతులను సమీక్షించే అవకాశం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై విద్యుత్​ సంస్థల తరపున వాదనలు వినిపించిన న్యాయవాదులు ఇప్పటికే రివ్యూ పిటిషన్​ పెండింగులో ఉందని చెబుతూ ఇటువంటి పరిస్థితుల్లో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దన్నారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు ఇప్పటికే ప్రమోషన్లకు సంబంధించి 2018లో కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొంటూ వీటిని జారీ చేసి ఏడు సంవత్సరాలు గడిచిపోయాయని పేర్కొంది.

వేరే బెంచీలో ఉన్న రివ్యూ పిటిషన్​ పై విచారణ పూర్తయ్యేంత వరకు విద్యుత్​ సంస్థల్లో ఎలాంటి ప్రమోషన్లు ఇవ్వొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని ఉద్యోగుల సంఘాల నాయకులు కోడెపాక కుమార స్వామి, సుధాకర్​ రెడ్డి, ముత్యం వెంకన్న గౌడ్​, సీ.భానుప్రకాశ్​ తదితరులు స్వాగతించారు.

ఇప్పటికైనా యాజమాన్యాలు మొండి వైఖరిని ప్రదర్శించకుండా వెంటనే ప్రమోషన్లను సమీక్షించాలన్నారు. నష్టపోయిన ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించాలని పేర్కొన్నారు. వెంటనే సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చొరవ తీసుకుని ఉద్యోగులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Also Read: స్వేచ్ఛ E పేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

Just In

01

Bigg Boss Telugu 9: మొదటి వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీరే..

Telangana: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కొత్త జోష్.. ఎందుకంటే?

Hyderabad Collector: చాకలి ఐలమ్మ వర్శిటీ పనులపై.. కలెక్టర్ హరిచందన కీలక ఆదేశం

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేది అప్పుడేనా?

Summit of Fire: ఖతార్‌లో ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు.. మరో కొత్త ఆపరేషన్