Anvesh On DGP Jithender (Image Source: Twitter)
తెలంగాణ

Anvesh On DGP Jithender: మరో బాంబ్ పేల్చిన నా అన్వేష్.. ఈసారి ఏకంగా డీజీపీనే..?

Anvesh On DGP Jithender: బెట్టింగ్ యాప్స్ అక్రమాలు, అందులో సెలబ్రిటీల ప్రమేయం గురించి వరుసగా వీడియో చేస్తున్న ప్రముఖ యూట్యూబర్ నా అన్వేష్ (Na Anveshanam).. తాజాగా ఓ పెద్ద బాంబే పేల్చారు. బెట్టింగ్ యాప్స్ గురించి తాజాగా మరో వీడియో పోస్ట్ చేసిన అతడు.. ఈసారి తెలంగాణ డీజీపీ జితేందర్ (DGP Jithender)పై సంచలన ఆరోపణలు చేశారు. ఆయన రూ.300 కోట్ల స్కామ్ కు పాల్పడినట్లు ఆరోపించారు. హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం ద్వారా ఈ కుంభకోణానికి తెరలేపినట్లు అన్వేష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.

విదేశాలకు దోచుకెళ్లారు!

హైదరాబాద్ మెట్రో రైలుపై బెట్టింగ్ యాప్స్ ప్రకటనలు ఇటీవల వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని నా అన్వేష్ ప్రస్తావిస్తూ దాని వెనక పెద్ద కుంభకోణమే జరిగినట్లు తాజాగా వీడియోలో ఆరోపించారు. డీజీపీ జితేందర్ ఆధ్వర్యంలో మెట్రో ఎండీ ఎన్.వి.ఎస్ రెడ్డితో పాటు ఆరుగురు ఐఏఎస్ అధికారులు కలిసి రూ.300 కోట్లకు పైగా దోచేశారని నా అన్వేష్ వీడియోలో అన్నారు. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు రూ.50వేల కోట్ల రూపాయలను దోచేసి విదేశాలకు పట్టుకెళ్లారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మూడు యాప్స్ ప్రమోషన్

హైదరాబాద్ మెట్రో.. మెుత్తం మూడు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిందని నా అన్వేష్ ఆరోపించారు. ఫెయిర్ ప్లే, 1x బెట్, 777 జాక్ యాప్స్ కు మెట్రో ట్రైన్ లోపల, బయట ప్రచారం చేసుకునేందుకు అనుమతించిందని అన్నారు. వాస్తవానికి మెట్రో ఏ నిర్ణయం తీసుకోవాలన్న ఓ కమిటీ ఉంటుందని.. అందులో ఎండీ ఎన్.వి.ఎస్. రెడ్డితో పాటు ఆరుగురు ఐఏఎస్ అధికారులు, డీజీపీ జితేందర్ మెంబర్లుగా ఉన్నారని అన్వేష్ తెలిపారు. మెట్రోకు సంబంధించిన విధి విధానాల రూపకల్పనలో వారు కీలకంగా వ్యవహరిస్తుంటారని పేర్కొన్నారు. వారు అనుమతి ఇవ్వకుంటే మెట్రోలో ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు జరగవని స్పష్టం చేసారు.

ఈడీ కేసులు

మెట్రోలో ప్రమోట్ చేసిన ఫెయిర్ ప్లే బెట్టింగ్ యాప్ పై చాలా దేశాల్లో నిషేధం ఉందని నా అన్వేష్ తెలిపారు. ముంబయిలో కూడా దీనిపై కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. అక్కడ 2023లో రూ.300 కోట్లు బెట్టింగ్ ద్వారా దోచుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ఏడాది 2024లో ఐపీఎల్ ను అక్రమంగా స్ట్రీమింగ్ చేయండపై ఫెయిర్ ప్లేపై ఈడీ కేసులు నమోదు చేసిందని పేర్కొన్నారు. అంతేకాదు గతేడాది డిసెంబర్ లో రూ.335 కోట్లను హవాలా చేసిందని ఈడీ బహిరంగంగానే ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ముంబయిలో సీజ్ చేసిన ఫెయిర్ ప్లే బెట్టింగ్ యాప్ ను హైదరాబాద్ లో ఎలా వేస్తారని అన్వేష్ ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్స్ అక్రమాలపై ఒక యూట్యూబర్ గా నాకున్న అవగాహన కూడా డీజీపీ సహా ఐఏఎస్ అధికారులకు లేకుండా పోయిందా? అని ప్రశ్నించారు.

విదేశాలకు రూ.13 వేల కోట్లు!

ఫెయిర్ ప్లే బెట్టింగ్ యాప్స్ రూ.13,000 కోట్ల రూపాయలను ఇక్కడ దోచేసి.. విదేశాలకు పట్టుకెళ్లిందని నా అన్వేష్ ఆరోపించారు. స్వయంగా ఈడీ ఈ విషయాన్ని ప్రకటించిందని వీడియోలో రుజువులు చూపించారు. ఫెయిర్ ప్లే కంపెనీ ఒక్కటి చేసిందే రూ.13,000 కోట్లని.. అవి కాకుండా 1x బెట్, 777 జాక్ ఇలా దేశంలో 100 వరకూ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయని నా అన్వేష్ తెలిపారు. ఈ లెక్కన ఎన్ని లక్షల కోట్ల ఫ్రాడ్ జరుగుతుందో అర్థం చేసుకోవాలని సూచించారు. అవినీతి అధికారులే ఈ యాప్స్ కు కొమ్ముకాస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పటివరకూ 128 దేశాలకు తిరిగానని.. భారత దేశమంతా అవినీతి దేశం ఎక్కడా చూడలేదని.. ఈ విషయాన్ని ప్రమాణం చేసి మరి చెబుతున్నానని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మెట్రోలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని.. అదే సమయంలో సీబీఐ ఎంక్వైరీ సైతం వేయాలని అన్నారు.

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?