Harish Rao – Kavitha: బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ త్వరలోనే వేయబోతుంది. అందుకు సన్నద్ధమవుతుంది. అయితే వేసే రాష్ట్ర కమిటీలో హరీష్ రావు, కవితలకు చోటు కల్పిస్తారా? లేదా? అనేది కేడర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎల్కతుర్తి సభలో ఫ్లెక్సీపై కేవలం తండ్రికొడుకు ఫొటో మాత్రమే ఉండటంతో తీవ్ర చర్చకు దారితీసింది. వారు రాజకీయంగా మరింత స్ట్రేంతం కావాలంటే పార్టీలో చోటుతోనే సాధ్యం. అయితే ఆ అవకాశం హరీష్, కవితలకు ఇస్తారా? మొండి చెయ్యి చూపు తారా? అనేది చర్చకు దారితీసింది.
ఎల్కతుర్తి సభ విజయవంతంతో ఇక స్పీడ్ పెంచనున్నారు. ప్రజలతో మమేకం అవుతూ ఒకవైపు ప్రజాసమస్యలపై పోరాడుతూ మరోవైపు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతంపై దృష్టిసారించబోతుంది. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటీలు, అనుబంధ కమిటీలు వేయనున్నారు. పార్టీ కమిటీల్లో ప్రస్తుతం కేసీఆర్ అధ్యక్షుడిగా, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. కవిత, హరీష్ రావు, సంతోష్ కుమార్ కు పార్టీలో ఎలాంటి పదవులు లేవు. కానీ ప్రస్తుతం హరీష్ రావు ఎమ్మెల్యేగా, కవిత ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.
Also read: Deputy CM on Terror Attack: రోహింగ్యాలపై.. పవన్ సంచలన కామెంట్స్
సంతోష్ కుమార్ రాజ్యసభ ఎంపీ పదవికాలం పూర్తయింది. అయితే త్వరలో వేసే రాష్ట్ర కమిటీలో కవితకు, హరీష్ రావు చోటు కల్పిస్తారా? లేదా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే పార్టీ పదవులు లేకుండా పార్టీ కార్యక్రమాలు ఎలా నిర్వహించాలనేదానిపై కొంత ఆలోచనలో పడ్డారు. కేడర్ ను గానీ, నాయకులను గానీ ఆదేశించి పనిచేయాలంటే పార్టీ పదవులు తప్పని సరి పరిస్థితి. అయితే వీరికి లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలను సొంత నిర్ణయంతో ముందుకు సాగే పరిస్థితి లేదు. సొంత కేడర్ తో మాత్రమే ప్రస్తుతం ముందుకు సాగుతున్నారు.
చర్చకు దారితీసిన రజోతోత్సవ సభ ఫ్లెక్సీ
బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్లను పురస్కరించుకొని రజతోత్సవ సభను నిర్వహించింది. ఈ సభా వేదికపై ఏర్పాటు చేసిన ప్లెక్సీలో కేసీఆర్, కేటీఆర్ ఫొటోలతో మాత్రమే ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇది రాజకీయ వర్గాలతో పాటు గులాబీ పార్టీలోనూ చర్చకు దారితీసింది. హరీష్ రావు, కవితలకు పార్టీతో పాటు సొంతంగా(కేడర్) అనుచర ఘనం ఉంది. అయితే వారంతా సభకు రావడంతో ఏర్పాట్లు చేసిన ప్లెక్సీలు ఫొటోలు లేకపోవడంతో కొంత అసహనానికి గురైనట్లు సమాచారం. పార్టీలో పదవి ఉంటే ఫ్లెక్సీలో ఫొటోలు ఉండేది కదా? అని పలువురు చర్చించుకున్నట్లు సమాచారం.
మరోవైపు కేసీఆర్ తర్వాత కేటీఆర్ కే పార్టీ పగ్గాలు అని కూడా పార్టీ నేతలకు, కార్యకర్తలకు హింట్ ఇచ్చినట్లు అయింది. గత ప్లీనరీలోనే తాను అందుబాటులో లేకపోతే కేటీఆర్ పార్టీ వ్యవహారాలన్ని చూసుకుంటారని కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటివరకు కేటీఆర్ పార్టీ కార్యక్రమాలు అన్ని చూస్తున్నారు. నెక్ట్స్ పార్టీలో హరీష్ రావు, కవిత, సంతోష్ ఎవరు లేరు. కేటీఆర్ పార్టీకి అన్ని అని సభలో ఏర్పాటు చేసిన ప్లెక్సీతో కేడర్ కు క్లీన్ చిట్ ఇచ్చారు.
ఇప్పటికే పార్టీ పదవులపై నజర్?
పార్టీలో కీలకనేతలుగా ఉన్నప్పటికీ పదవులు లేవు. దీంతో కొంత నైరాశ్యానికి గురవుతున్నట్లు సమాచారం. దాని నుంచి బయటపడాలంటే రాష్ట్ర కమిటీలో చోటు తప్పని సరి అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కవిత పార్టీలో కీలక పదవికావాలని పార్టీ అధినేత కేసీఆర్ ను కోరినట్లు సమాచారం.
పదవి లేకుండా పార్టీలో గుర్తింపు ఉండదని, పార్టీ బలోపేతం చేయాలన్న అవసరమనే భావనకు వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. అందుకే పార్టీ రాష్ట్ర కమిటీలో కీలకమైన సెక్రటరీ జనరల్ గానీ, వైస్ పెసిడెంట్ గానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ గానీ ఇలా ఏదో ఒకటి ఇవ్వాలని పార్టీ అధినేత కేసీఆర్ ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.
Also read: BRS BJP Alliance: బీజేపీ – బీఆర్ఎస్ పొత్తు.. సభ వేదికగా కేసీఆర్ హింట్స్.. టార్గెట్ హైదరాబాద్!
హరీష్ రావు సైతం కొంత నైరాశ్యంలో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. ఆయనకు సైతం రాష్ట్ర కమిటీలో కీలక పదవి ఇస్తే మళ్లీ యాక్టీవ్ అవుతారని సమాచారం. ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లాకు మాత్రమే పరిమితం అయ్యారు. రాష్ట్రకమిటీలో చోటు కల్పిస్తే పార్టీలో ప్రాధాన్య ఇచ్చినట్లు అవుతుందని, పార్టీని సైతం స్ట్రెంతం చేసే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అధినేత నిర్ణయమే ఫైనల్
బీఆర్ఎస్ పార్టీ ఉద్యమపార్టీగా కొనసాగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ పార్టీగా మార్చారు. ఆతర్వాత ఆపార్టీపై కుటుంబ పార్టీగా ముద్రపడింది. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు అధ్యక్ష, వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల్లో కొనసాగుతున్నారు. ఈ తరుణంలో త్వరలో వేయబోయే రాష్ట్ర కమిటీలో హరీష్ రావు, కవితకు చోటు కల్పిస్తారా? లేదా? అనేది చర్చకు దారితీసింది.
అధినేత కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారు? వారికి పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు? అసలు అవకాశం కల్పిస్తారా? లేదా అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ కేసీఆర్ కమిటీలో అవకాశం కల్పిస్తే ఏ పదవి అప్పగిస్తారు అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ విమర్శలు వస్తే వాటికి ఎలా చెక్ పెటడతారనేది చూడాలి. ఏది ఏమైనప్పటికీ ఎల్కతుర్తి సభలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.