Singer Pravasthi: సింగర్ ప్రవస్తి వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. అసలు ఎవరూ ఉహించని విధంగా ఆ అమ్మాయి మీడియా ముందుకొచ్చి ” పాడుతా తీయగా ” షో గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఆ షో కి జడ్జెస్ గా వ్యవహరిస్తున్న స్టార్ సింగర్స్ సునీత, మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ ఎమ్ కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో, ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. ఆ అమ్మాయి చెప్పినవి విన్న తర్వాత సింగింగ్ ఇండస్ట్రీలో ఇంత జరుగుతుందా అనే సందేహాలు వస్తున్నాయి. అయితే, తాజాగా ప్రవస్తి ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొత్త విషయాలను బయట పెట్టింది. ప్రస్తుతం, దీనికి సంబందించిన వీడియో వైరల్ అవుతుంది.
ప్రవస్తి ఆరాధ్య మాట్లాడుతూ ” నేను ఇలా బయటికి రావడానికి గల కారణం ఏంటంటే.. నాకు తగిలిన దెబ్బ అలాంటిది. చాలా పెయిన్ ఉంది కాబట్టే మీడియా ముందుకు వచ్చాను.అసలేం జరిగిందో నాకు తెలుసు. నా పేరెంట్స్ కి తెలుసు. ఎవరూ కూడా నా లాగా అవ్వకూడదు. నెక్స్ట్ వచ్చే వాళ్ళకి అంతా మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే చేశాను. అలాగే ప్రేక్షకులను ఎందుకు ఫూల్స్ చేస్తున్నారనే బాధ కూడా చాలా ఉంది. మేము 15 గంటలు షూటింగ్ లో ఉంటాము. కానీ, ఆడియెన్స్ చూసేది 1 గంట ఎపిసోడ్ మాత్రమే. నాకు మొత్తం తెలుసు కాబట్టి మొత్తం బయట పెట్టాను. కెమెరా ముందు ఒకలా ఉంటారు. కెమెరా లేనప్పుడు ఒకలా ఉంటారు. సాంగ్ సెలెక్షన్ కూడా ఎంత మోసం జరిగిందో ఆధారాలతో సహ బయట పెట్టాను. నాకు ఒక లాగా , వేరే వాళ్ళకి ఇంకో లాగా చేశారు. ఇంకోటి పాడే ముందు ఈ రోజు ఎలిమినేషన్ ఉంది.. అని ముందే చెప్పారు.. అప్పుడు నాకేలా ఉంటుంది.
నాకు సెట్ అవ్వని డ్రస్సులు కూడా వేసుకోమని నన్ను ఫోర్స్ చేశారు. అది చాలా తప్పు. వాళ్ళు అలా అన్నప్పుడు నాకేలా ఉంటుంది. నా 20 ఏళ్లలో నాకు పాటలు పాడటంలో 15 ఏళ్ల అనుభవం ఉంది. ఎవరూ ఎలా చేస్తున్నారో నాకు అన్నీ అర్దమవుతాయి. ఎలిమినేషన్ అయ్యాకే ఇలా ఎందుకు చేస్తున్నా అంటే నా దగ్గర క్లారిటీ ఉందని.. బాధ నాది.. నొప్పి నాది ” అంటూ సింగర్ ప్రవస్తి తన బాధను చెప్పుకుంది.