Hebah Patel: హీరోయిన్ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సినిమాల్లో కూడా కనిపించడం లేదు. టాలీవుడ్ లో గ్లామర్ హీరోయిన్‌గా పాపులర్ అయిన హెబ్బా, గత కొంతకాలంగా ఏ సినిమాల్లో కనిపించింది లేదు. స్టార్ హీరోలతో అవకాశాలు తెచ్చుకునే వరకు ఈమె కెరీర్ వెళ్ళింది లేదు. అయితే, రీసెంట్ గా ‘ఓదెల-2’ లో నటించి తన మార్కును చూపించింది. వాస్తవానికి ఈ చిత్రంలో తమన్నా కన్నా మంచి మార్కులు వేపించుకుంది. ఈ నేపథ్యంలోనే ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆసక్తికర విషయాలు చెప్పింది. దీనికి సంబందించిన వీడియో వైరల్ అవుతుంది.
హెబ్బా పటేల్ నాకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత చెన్నై , బెంగుళూరు అంటే ఇష్టం. నేను ఎప్పుడూ మూవీ షూటింగ్స్ చేసినా నా సొంతంగా చేయను. డైరెక్టర్స్ ఎలా చెబితే అలా చేస్తా.. నేను ఇప్పటి వరకు చేసిన సినిమాలు అన్నీ 99 పర్సెంట్ నా దర్శకులు ఏం చెబితే అలాగే చేశా.. కుమారి 21 ఎఫ్ లో కూడా నేను అంత బాగా చేయడానికి కారణం సుకుమార్ గారు. ఒక థింగ్ లేకపోతే హెబ్బా బతకలేదు అని యాంకర్ అడగగా .. నేను మనీ లేకపోతే బతకలేను అంటూ ..డబ్బులు ఖచ్చితంగా కావాలి. ఐ లవ్ మనీ.. నేను నా సంపాదనతోనే బతకాలి అనుకుంటాను. నేను ఒకర్ని చేయి చాచి డబ్బు అడగను.. అలాగే నేను డే ని ఎంజాయ్ చేస్తా .. అలాగే నైట్ ను కూడా ఎంజాయ్ చేస్తా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.