తెలంగాణ: CM Revanth Reddy: నక్సలైట్ల చర్చలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి సలహాలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో శాంతి చర్చల కమిటీ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన అనుభవం జానారెడ్డికి ఉన్నదని వివరించారు.
మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకుంటామన్నారు. కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని కమిటీ నేతలు సీఎంను కోరగా, సానుకూలంగా స్పందించారు. నక్సలిజాన్ని తమ ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రమే చూస్తుందన్నారు.
Also Read: Leaders are Confused: గులాబీ గుబాళిస్తే.. కమలం పరిస్థితేంటి అయోమయంలో ఆ పార్టీ నేతలు
శాంతిభద్రతల అంశంగా ఎట్టి పరిస్థితుల్లో పరిగణించవద్దన్నారు. మంత్రులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గాప్రసాద్, జంపన్న, రవి చందర్ లు ఉన్నారు.