KCR Serious: వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన సభలో మాజీ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. సీఎం లేదు పాడు లేదు.. గమ్ముగుండు.. వీళ్లు ఇంతకు మనోళ్లేనా అంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం. సభలో కేసీఆర్ ప్రారంభం నుండి చివరి వరకు ప్రసంగానికి అడ్డుతగలడంపై కాస్త కెసిఆర్ అసహనం వ్యక్తం చేశారు.
ముందుగా కెసిఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అంతలోనే సీఎం కెసిఆర్ అంటూ బిగ్గరగా కేకలు వినిపించాయి. ఆ కేకలు అలాగే కంటిన్యూ అవుతుండగానే తన ప్రసంగాన్ని కెసిఆర్ ఆపివేశారు. సీఎం లేదు పాడు లేదు గమ్ముగుండు.. సభకు వచ్చిన జనాలకు తాను మాట్లాడేది వినిపించాలని కెసిఆర్ అన్నారు. ఆ తర్వాత మళ్లీ ప్రసంగం మొదలైంది. మళ్లీ సభకు వచ్చిన ఒక పది మంది గట్టిగా కేకలు వేయడం ప్రారంభించారు.
గట్టిగా కేకలు వేసే సమయం ఉందని, ఇలాంటి కేకలతో ఏమి కాదని కెసిఆర్ అన్నారు. ఆ తర్వాత మళ్లీ ప్రసంగం స్టార్ట్ చేయగా, మళ్లీ కేకలు వేయడంతో కెసిఆర్ కాస్త ఫైర్ అయ్యారు. ఈ పది మంది మనోళ్లేనా అంటూ పక్కన ఉన్న నాయకులను కెసిఆర్ అడిగారు. కాస్త సైలెంట్ గా ఉండాలని, ఉదయం నుండి తన కోసం, తన మాటల కోసం వేచి ఉన్నవారు ఉన్నారని కెసిఆర్ అన్నారు.
Also Read: KCR Speech: ప్రజల్లోకి వస్తున్నా.. ఇక ఊరుకోను.. కేసీఆర్
అయితే తన ప్రసంగం అలా సాగించడం ఆ తర్వాత కార్యకర్తలను సముదాయించడమే కెసిఆర్ కు పెద్ద సవాలుగా మారిందని చెప్పవచ్చు. అంతేకాకుండా సభ ప్రారంభం కావడానికి ముందు చాలా మంది కార్యకర్తలు పోల్స్ ఎక్కగా, వారిని కిందికి దింపేందుకు నాయకులు మైక్ లో కేకలు వేయాల్సిన పరిస్థితి కనిపించింది. చివరగా తన ప్రసంగం ముగించి వెళుతున్న కెసిఆర్, ఇప్పుడు వేయండి కేకలు అంటూ అనడంతో కార్యకర్తలు, జై కెసిఆర్ అంటూ గట్టిగా నినదించారు. కెసిఆర్ ప్రసంగం 40 నిమిషాల పాటు సాగినప్పటికీ, కార్యకర్తలను సర్దిచెప్పేందుకే 10 నిమిషాలు కేటాయించారని చెప్పవచ్చు.