తెలంగాణ: Minister Ponnam Prabhakar: రవాణాకు ఆర్టీసీ లైఫ్ లైన్ అని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రతి నెల ఆర్టీసీకి రూ.300 కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం విక్రమార్క ఆర్టీసీ పై సానుకూలంగా ఉన్నారని, సమస్యలు పరిష్కారం చేసుకుందాం అన్నారు. మేము కారుణ్య నియామకాలు చేశాం కొత్త నియామకాలు చేశాం బస్సులు కొనుగోలు చేశాం సంస్థను పరిరక్షిస్తూ దానిని విస్తరిస్తున్నామన్నారు.
హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని ఓ హోటల్‌లో జరిగిన టీజీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్పేర్ అసోసియేషన్ ఐదో వార్షిక సమావేశానికి మంత్రి హాజరై 90 ఏళ్లు నిండిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులను సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ తో కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ రిటైర్డ్ ఆర్టీసీ అధికారులు, సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యానికి సహకారం అందిస్తుందని తెలిపారు.
ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్ అంశాలను దశలవారీగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం, ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సౌకర్యం, సంస్థ పరిరక్షణ ఈ మూడు అంశాలే ప్రాధాన్యాలుగా సంస్థ ముందుకు పోతోందని స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం వల్ల ఆర్టీసీ ఆర్థిక పరిపుష్టి సాధిస్తోందన్నారు. తెలంగాణ ఆర్టీసీని దేశంలోనే నంబర్ వన్ సంస్థగా మార్చేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలు చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
ఆర్టీసీ తో నాకు ముందు నుండి మంచి సంబంధం ఉందన్నారు.
ఆర్టీసీ గత 10 సంవత్సరాల్లో సంస్థ ముసేస్తం పని అయిపోయింది అనే పరిస్థితి ఉండేదని, నియామకాలు చేపట్టకుండా, ఒక్క బస్సు కొనుగోలు చేయకుండా ఆర్టీసీ నీ విస్తరించకుండా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయన్నారు. మీ సమస్యలు ప్రభుత్వం దృష్టికీ తీసుకుపోయి సీఎంతో మాట్లాడతాం అన్నారు. ఆర్టీసీ నీ మూసివేస్తున్నాం అనే పరిస్థితి నుండి డిసెంబర్ 9 మహా లక్ష్మి తరువాత ఆర్టీసీ ప్రగతి లోకి వచ్చిందన్నారు.
ఆర్టీసీ లో పని చేసిన వారు జీవితకాలం అంత ఆర్టీసీ బాగుండాలని ఆలోచిస్తారు అందుకే ఆర్టీసీ ముందుకు పోతుందన్నారు. 40 వేల కోట్లు పనులు జరిగి బిల్లులు చెల్లించాల్సినవి ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం వచ్చే నాటికి 2023 లో సీసీఎస్ లో 682 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇప్పుడు దానిని 450 కోట్లకు తగ్గించాం దానిని జీరో చేస్తాం అని స్పష్టం చేశారు. పీఎఫ్ బకాయిలు 1373 కోట్లు ఉంటే దానికి 580 కోట్లకు తగ్గించామన్నారు.
రిటైర్మెంట్ అయిన పేమెంట్స్ ఏరోజు రిటైర్డ్ అయితే అదే రోజు చెల్లింపులు చేసేలా చూస్తున్నామని, ఇవి ఒకేరోజు పరిష్కారమయ్యే సమస్యలు కావు అన్నారు. మీసలహాలు ఇస్తే స్వీకరిస్తాం రాజకీయ ప్రేరేపితమైన అంశాల్లో పడి సంస్థను ఇబ్బంది పెట్టద్దు అని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ ఎండీ సజ్జనర్ మాట్లాడుతూ రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సలహాలు, సూచనలతో సంస్థలో ఎన్నో వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెట్టామని తెలిపారు.
ఆర్టీసీ రెగ్యులర్ అధికారులు, సిబ్బందితో పాటు రిటైర్డ్ ఎంప్లాయిస్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని టీఎస్‌ఆర్టీసీ తార్నాక ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. తార్నాక ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య సేవలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగవేందర్ రావు, వైస్ ప్రెసిడెంట్ నాగరాజు, సెక్రటరీ విజయ్ కుమార్, జాయింట్ సెక్రటరీ సీతరాం బాబు, ట్రెజరరీ వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Also Read: Mahesh Kumar Goud: కవిత వ్యాపారాలు, కేసీఆర్ కుటుంబం.. పై మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు!