Mahesh Babu ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Mahesh Babu: విచారణకు హాజరు కాలేను.. ఈడీకి రిక్వెస్ట్!

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఈడీ నోటీసులు పంపించిన విషయం మనకు తెలిసిందే.  ఎవరూ ఊహించలేని విధంగా ఈడీ నోటీసులు పంపించడంతో ఇండీస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సురానా డెవలపర్స్, సాయిసూర్య డెవలపర్స్ కేసులో ఏప్రిల్ 27న విచారణకు హాజరుకావాలంటూ అధికారులు ఆదేశించారు.

ఇప్పటికే వీటికి సంబందించిన ఆధారాలను సేకరించారు. సాయిసూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీల మానీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బషీర్‌బాగ్‌లోని తమ ఆఫీసులో నేడు విచారణకు హాజరు కావాలని మహేశ్‌కు నోటీసులు పంపించారు. సాయిసూర్య డెవలపర్స్ కంపెనీ నుంచి మహేశ్‌కు మొత్తం రూ.5.9 కోట్లు చెల్లించినట్లు ఈడీ అధికారుల ఆధారాలను సేకరించారు. చెక్కుల రూపంలో రూ.3.4 కోట్లు, నగదు రూపంలో రూ.2.5 కోట్లు చెల్లించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే నేడు ఈడీ విచారణకు మహేష్ బాబు హాజరవుతారా లేదా అనే దానిపై సస్పెన్స్ వీడింది. అయితే మహేష్ బాబు రాజమౌళి చిత్ర షూటింగ్ లో ఉన్నట్టు సమాచారం.

Also Read: Babloo Prithiveeraj: మూవీ ఈవెంట్ కు పిలిచి.. అవమానిస్తారా? బబ్లూ పృథ్వీరాజ్ కామెంట్స్

ఈ క్రమంలోనే మహేష్ బాబు ఈడీకి లేఖ రాసారు. అయితే, ఈడీ అధికారులకు మెయిల్ ద్వారా లేఖను పంపినట్టు తెలిసిన సమాచారం. రేపు విచారణకు హాజరు కాలేను అని, సినిమా షూటింగ్ కారణంగా విచారణకు రాలేను, మరో తేదీ ఇవ్వాలని కోరినట్టు తెలుస్తుంది. మరి, దీనిపై ఈడీ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక, ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళితో చిత్రంతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన రెండు షెడ్యూల్స్ షూట్ పూర్తవ్వగా మూడో షెడ్యూల్ హైదరాబాద్ లో వేసిన సెట్ లో మొదలు కానుంది.

Just In

01

Gold Price Today: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు?

DSP Bribery Case: ఏసీబీలో కలకలం రేపుతున్న డీఎస్పీ వసూళ్ల వ్యవహారం

Mahabubabad District: మహబూబాబాద్‌లో కుక్కల స్వైర విహారం.. పట్టించుకోని అధికారులు

Maoist Ashanna: మావోయిస్టు ఆశన్న సంచలన వీడియో.. ఏమన్నారంటే..?

Kishan Reddy: జూబ్లీహిల్స్‌లో రౌడీయిజం పెరిగిపోయింది: కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు