Mahesh Kumar Goud: అక్రమ దందాలతో కవిత దేశ వ్యాప్తంగా ఫేమస్ అయ్యారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. దోపిడీకి కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ కుటుంబం అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ…హైదరాబాద్ చుట్టూ ఉన్న పది వేల ఎకరాల భూములను కేసీఆర్ ప్రభుత్వ హయంలో ప్రైవేట్ సంస్థలకు కట్టపెట్టారన్నారు.
అక్రమంగా లబ్ధి పొందారన్నారు. కవిత రౌడీ కాబట్టే బహిరంగంగా చెప్పుకుంటున్నారని చురకలు అంటించారు. లిక్కర్ వ్యాపారం చేసి రౌడీ మారిపోయిందన్నారు. ఇక రజతోత్సవ సభ బీఆర్ఎస్ పార్టీ కోసమా? టిఆర్ఎస్ పార్టీ కోసమా? అని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ ఆలోచన మేరకే కులగణన, ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయబోతున్నామన్నారు. రాహుల్ గాంధీ మాటకు కట్టుబడి వరంగల్ డిక్లరేషన్ లో హామీ ఇచ్చినట్లు రెండు లక్షల రుణమాఫీ చేశామన్నారు. హెచ్ సీయూ భూములు గురించి కవిత మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు