SLBC Tunnel Update: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా SLBC ప్రాజెక్ట్ టన్నెల్‌లో ప్రమాదం కారణంగా 8 మంది చిక్కుకున్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా మిగిలిన ఆరుగురి కోసం 63 రోజుల నుండి కొనసాగిన సహాయక చర్యలు ఈ రోజుతో ముగిసాయి. టన్నెల్ సహాయక చర్యల కొనసాగింపు పై హైదరాబాద్ లో టెక్నికల్ టీం సమీక్ష సమావేశం పూర్తయింది.
సాంకేతిక కారణాల వల్ల సహాయక చర్యలను 3 నెలల పాటు నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. టన్నెల్ లో మట్టి బురద తొలగింపు ప్రక్రియ పూర్తయిందని కేవలం డేంజర్ జోన్ లో కొంతమేర తొలగించాల్సి ఉందన్నారు. ప్రమాద ప్రాంతం నుండి 260 మీటర్ల మేర మట్టి బురద టిబిఎం శిథిలాలు తొలగించారు.
ప్రమాదంలో చనిపోయిన ఎనిమిది మందిలో కేవలం ఇద్దరి మృతదేహాలు మాత్రమే వెలికితీయగలిగారు. మిగిలిన వారి కోసం ఎంత ప్రయత్నించిన ఆచూకీ లభించలేదు. టన్నెల్ లోని ఇన్‌లెట్ ద్వారా ముందుకెళ్లడానికి ఎంత ప్రయత్నించినా వీలుకాకపోగా, మిగిలిన 50 మీటర్ల ప్రాంతంలో రిస్క్యూ ప్రమాదం అని జిఎస్ఐ అధికారులు తెలిపారు.
మిగిలిన 50 మీటర్లు ప్రాంతాన్ని క్రిటికల్ జోన్ గా గుర్తించిన అధికారులు కంచ ఏర్పాటు చేసారు. అధికారుల ఆదేశాలతో సింగరేణి మైన్స్ రెస్క్యూ సిబ్బంది వెనుదిరిగి రావడంతో ఇన్ టన్నెల్ ప్రధాన ద్వారం దగ్గర రెస్క్యూ టీం క్యాబిన్లు ఖాళీ అయ్యాయి.
రెస్క్యులో పాల్గొన్న 12 ఏజెన్సీల బృందాలను తిరిగి అవసరమైతే వాడుకుంటామన్నారు. నిపుణుల ఉప కమిటీ టన్నెల్ ను పరిశీలించిన తర్వాత రెస్క్యూపై కమిటీ ఆదేశాల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.