HC On CM Revanth Reddy Case: నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో దాఖలైన పిటిషన్ పై హైకోర్ట్ (Telangana High Court)లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి స్వల్ప ఊరట లభించింది. బీజేపీ దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్ (BJP Criminal Petition) విచారణపై ప్రత్యక్ష హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే కింది కోర్టు విచారణపై స్టే ఇచ్చేందుకు మాత్రం ధర్మాసనం నిరాకరించింది. తనపై నమోదైన క్రిమినల్ కేసును రద్దు చేయాలంటూ సీఎం రేవంత్ దాఖలు చేసిన పిటిషన్ పై తదుపరి విచారణను జూన్ 12వ తేదీకి వాయిదా వేసింది.
గతేడాది మేలో కొత్తగూడెం (Kothgagudem)లో జరిగిన బహిరంగ సభలో నిరాధార ఆరోపణలు చేశారని సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ క్రిమినల్ పిటీషన్ దాఖలు చేసింది. బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తారని రేవంత్ రెడ్డి ప్రసగించారని పిటీషన్ లో పేర్కొంది. దీనివల్ల బీజేపీ పరువుకు నష్టం కలిగిందని పిటీషనర్, బీజేపీ నేత కాసం వేంకటేశ్వర్లు (Kasam Venkateswarlu) కోర్టుకు తెలిపారు. ఇప్పటికే బీజేపీ క్రిమినల్ పిటీషన్‌పై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు విచారణ చేపట్టింది. రేవంత్ రెడ్డి ప్రసగించిన ఆడియో (Audio), వీడియో (Vedio) సాక్ష్యాలకు పరిశీలించింది. కాసం వేంకటేశ్వర్లు వాంగ్మూలాన్ని సైతం ప్రజా ప్రతినిధుల కోర్టు రికార్డ్ చేసింది.
Also Read: Chandrababu Health Tips: చంద్రన్న ఆరోగ్య సూత్రాలు.. ఇవి పాటిస్తే ఐరన్ బాడీనే!
అయితే ప్రజాప్రతినిధుల కోర్టు విచారణలో ఉన్న కేసును కొట్టేయాలని సీఎం రేవంత్ రెడ్డి హైకోర్ట్ లో పిటిషన్ వేశారు. రాజకీయ ప్రసంగాలకు పరువు నష్టం ఉండదని పిటీషన్‌లో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు పలు సుప్రీంకోర్టు తీర్పులను పిటీషన్‌లో చేర్చారు. వాటిని పరిగణలోకి తీసుకున్న హైకోర్ట్.. కేసు విచారణ హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. తదుపరి విచారణను జూన్ 12కి వాయిదా వేసింది.