Man married 2 Women (image credit:Canva)
తెలంగాణ

Man married 2 Women: ఇద్దరితో లవ్.. ఒకేసారి మ్యారేజ్.. నువ్వు సూపర్ భయ్యా..

Man married 2 Women: నేటి కాలంలో ఒక ప్రేమను విజయం వైపు నడిపించడం కష్టంగా ఉంటే, ఈ యువకుడు మాత్రం ఒకేసారి రెండు ప్రేమలు గెలిపించుకున్నాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగా, నెటిజన్స్.. నువ్వు సూపర్ భయ్యా అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఈ అరుదైన ఘటన మాత్రం కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో అసలు చెప్పలేం. అలా పుట్టిన ప్రేమ ఒకరికే సొంతం కావడం కామన్. కానీ కొన్నిసార్లు ప్రేమ చేసే చిలిపి పనులు ఎలా ఉంటాయంటే, మరొకరిపై సైతం అదే భావన కలుగుతుంది. అలా ప్రేమ రెండుగా విడిపోయినప్పుడు వచ్చే సమస్యలు అనేకం. ఒకే యువకుడు ఇద్దరిని ప్రేమిస్తే ఆ బాధ వర్ణనాతీతం. కానీ ఈ యువకుడు మాత్రం ఆ రూట్ లో సక్సెస్ సాధించాడు.

అసలు విషయం ఏమిటంటే.. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఒక యువకుడు ఒకే మండపంలో ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న ఘటన జరిగి నెలరోజులు గడవక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఆ ఘటనలో ఇద్దరూ అక్కా చెల్లెలు కావడంతో ఏ ఇబ్బంది లేదని భావించవచ్చు. కానీ ఇప్పుడు జరిగిన ఘటన మాత్రం ఇదో రకం అనవచ్చు.

జైనూరు మండలం అడ్డెసర గ్రామానికి చెందిన రంభబాయి – బాద్రుషావ్ దంపతుల రెండో కుమారుడు ఆత్రం చత్రుషావ్.. అదే గ్రామానికి చెందిన యువతితో నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. అలాగే కెరమెరి మండలం సాంగి గ్రామానికి చెందిన బంధువైన మరో యువతిని సైతం ఏడాదిగా ప్రేమిస్తున్నాడు. 15 రోజుల క్రితం ఆమెతో పెళ్లి చూపులు జరిగాయి. విషయం మొదటి యువతికి తెలియడంతో ఆమె రాయి సెంటర్‌ను ఆశ్రయించారు. ఇద్దరు అమ్మాయిలూ చత్రుషావ్‌ని పెళ్లి చేసుకుంటామని రాయి సెంటర్ పెద్దలు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఒప్పుకోవడంతో.. పెళ్లి పత్రికలు ముద్రించి వివాహం చేయించారు.

Also Read: Sircilla Crime: కనీవినీ ఎరుగని ఘోరం.. పళ్లతో కొరికి.. గొడ్డలితో నరికి హత్యాచారం!

ఈ పెళ్లి తంతు గురించి తెలుసుకున్న యువకులు భయ్యా.. లక్ అంటే నీదే. ఇద్దరిని ప్రేమించావు, ఇద్దరినీ పెళ్లి చేసుకున్నావు. నువ్వు సూపర్ అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఎంతైనా ఒక ప్రేమను విజయం వైపు నడిపించడం కష్టంగా ఉన్న రోజుల్లో, రెండు ప్రేమలను పెళ్లి వరకు తీసుకెళ్లిన వైనం ఇప్పుడు వైరల్ గా మారింది.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు