Sitara and Akira: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో వారసుల అరంగేట్రానికి సంబంధించి బీభత్సంగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ముందుగా నందమూరి నటసింహం బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) అరంగేట్రానికి సంబంధించి ఈ మధ్య కాలంలో ఏ విధంగా వార్తలు హైలెట్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రేపు సినిమా ప్రారంభోత్సవం అనగా, మోక్షు సినిమా ఆగిపోయింది. కారణం అయితే మోక్షజ్ఞకి వైరల్ ఫీవర్ అని చెప్పారు కానీ, ఆ తర్వాత కూడా ఆ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోలేదు. దీంతో, ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ చేయాల్సిన సినిమా ఆగిపోయిందనేలా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినవస్తున్నాయి.
Also Read- SSMB29: మహేష్, రాజమౌళిల సినిమా లీక్స్‌పై నాని షాకింగ్ రియాక్షన్!
ఇక మోక్షజ్ఞతో పాటు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తనయుడు అకీరా నందన్ (Akira Nandan), మహేష్ బాబు (Mahesh Babu) తనయుడు గౌతమ్ కృష్ణల అరంగేట్రంపై కూడా ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. రీసెంట్‌గా మహేష్ తనయుడు గౌతమ్ నటించిన వీడియో ఒకటి సెన్సేషన్‌ని క్రియేట్ చేసింది. సేమ్ టు సేమ్ తండ్రిలానే నటిస్తున్నాడనేలా గౌతమ్ నటనపై అంతా మాట్లాడుకున్నారు. ఆ వీడియోలో అన్ని రకాల ఎమోషన్స్‌ని పలికించి, అతి త్వరలోనే ఎంట్రీ ఉంటుందనేలా హింట్ ఇచ్చేశాడు. ఇక అకీరా నందన్ గురించి వచ్చే వార్తలకు లెక్కే లేదు. పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమాలో చేస్తున్నాడని ఒకసారి, చేయడం లేదని మరోసారి.. ఇలా నిత్యం ఏదో ఒక వార్త అకీరాపై వస్తూనే ఉంది. అకీరా అరంగేట్ర సినిమాను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తాడనేలా కూడా టాక్ నడిచింది.
అయితే ఈ వార్తలన్నింటినీ అకీరా మదర్ రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వస్తుంది. నిజంగా అకీరా నటిస్తానంటే ముందుగా సంతోషపడేది నేనే అంటూ చెబుతుంది. నిజంగా అలాంటి విషయమే ఉంటే, నేనే ముందు మీడియాకు చెబుతానని ఇటీవల కూడా ఓ వీడియోలో ఆమె చెప్పింది. దీంతో మోక్షజ్ఞ విషయంలో నందమూరి ఫ్యాన్స్ ఎలాగైతే కన్ఫ్యూజన్‌లో ఉన్నారో, సేమ్ టు సేమ్ మెగా ఫ్యాన్స్‌లో కూడా అదే కన్ఫ్యూజన్ మొదలైంది. వారి అరంగేట్రానికి సంబంధించి అసలు మ్యాటర్ ఇలా ఉంటే కొందరు నెటిజన్లు మాత్రం ఊహించని కాంబినేషన్లను సెట్ చేసి, ఈ కాంబోలో సినిమా పడితేనే, తెరలు తగలబడిపోవడం గ్యారంటీ అనేలా కామెంట్స్ చేస్తుండటం విశేషం.
Also Read- Singer Sunitha: సింగర్ సునీత మనసు దోచుకున్న హీరో ఎవరో తెలుసా? తెలిస్తే షాకవుతారు
అలాంటి కాంబోనే పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్, మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని (Sitara Ghattamaneni). అకీరా, సితార ఫొటోలను పక్కపక్కన పెట్టి.. ఈ కాంబోలో సినిమా పడితేనా? ఇండస్ట్రీ షేక్ ఐపోతుందేమో! అని పోస్ట్‌లు పెడుతున్నారు. నిజంగా ఫ్యాన్స్ కోరుకుంటున్నట్లుగా ఈ కాంబోలో మూవీ పడితే.. ఆ సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలుంటాయి. నిజంగా ఈ కాంబోలో సినిమా తీసే నిర్మాత పంట పండినట్టే. సితార కూడా నటనపై ఇంట్రస్ట్‌గా ఉందనేలా స్వయంగా సూపర్ స్టారే ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కాబట్టి.. త్వరలో, ఈ కాంబోలో మూవీ ఊహించుకునే వారి కలలు నిజమయ్యే ఛాన్స్ అయితే లేకపోలేదు. చూద్దాం భవిష్యత్‌లో ఏమైనా జరగవచ్చు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు