Nani on SSMB 29 Leaks
ఎంటర్‌టైన్మెంట్

SSMB29: మహేష్, రాజమౌళిల సినిమా లీక్స్‌పై నాని షాకింగ్ రియాక్షన్!

SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu), దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘SSMB29’. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. రాజమౌళి సినిమాలంటేనే భారీతనానికి కేరాఫ్ అడ్రస్. అలాంటిది సూపర్ స్టార్ కూడా యాడ్ అవడంతో.. ఈ సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలున్నాయి. అందులోనూ రాజమౌళి పేరు ఆర్ఆర్ఆర్‌ (RRR)తో హాలీవుడ్‌లో కూడా మోత మోగింది. ఇప్పుడు హాలీవుడ్‌లోని అందరి కళ్లు రాజమౌళి, మహేష్‌ల సినిమాపైనే ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు. అందుకే, ఎవరికి.. ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా, ఎన్నో జాగ్రత్తలతో రాజమౌళి ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

Also Read- Suryakantham: సూర్యకాంతం ఇంట్లో పని చేయాలా? పని మనిషి ఏం చేసిందంటే?

అయితే ఆయన ఎంత జాగ్రత్తగా చిత్రీకరణ జరుపుతున్నా, కొన్ని విజువల్స్ మాత్రం లీక్ అవుతూనే ఉన్నాయి. ఇటీవల ఒడిశాలో చిత్రీకరణ జరుగుతున్న సమయంలో కొన్ని విజువల్స్ లీక్ అయిన విషయం తెలిసిందే. ఈ లీక్స్‌పై రాజమౌళి సీరియస్ అవడమే కాకుండా, యూనిట్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లుగా కూడా టాక్ నడిచింది. అయితే ఈ లీక్స్‌పై తాజాగా రాజమౌళి ‘ఈగ’ హీరో, నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) రియాక్ట్ అయ్యారు. నాని హీరోగా, శైలేష్ కొలను దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. ఈ మూవీ మే 1న విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం నానితో పాటు చిత్రయూనిట్ అంతా ప్రమోషన్స్‌లో నిమగ్నమైంది. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి, మహేష్‌ కాంబో మూవీ లీక్స్‌పై కూడా నాని మాట్లాడారు.

‘‘రాజమౌళి సినిమా అంటే ఒక బ్రాండ్. ఆయన సినిమా చేస్తున్నారంటే మెయిన్ ఆర్టిస్ట్‌లే కాకుండా వేలల్లో జూనియర్ ఆర్టిస్ట్‌ల అవసరం ఉంటుంది. ప్రతి విభాగంలో అందరినీ చెక్ చేసి పంపిస్తుంటారు. సెల్ ఫోన్లు కూడా అనుమతించరు. కానీ కొందరు రెండు సెల్ ఫోన్స్ దగ్గర పెట్టుకుని ఒకటి ఇచ్చి, మరొకదాన్ని వారి వెంటే తీసుకెళ్తారు. అలా తీసుకెళ్లిన ఫోన్‌తో ఎవరికీ కనిపించకుండా ఫొటోలు తీస్తుంటారు. వారి ఉద్దేశ్యం లీక్ చేయడం, కాబట్టి ఎన్నో అడ్డదారులను వారు అనుసరిస్తారు. ఈ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. లీక్స్ ఆపలేం. ఎంతో రహస్యంగా ఆ సినిమాను తీయాలని అనుకున్నారు. కానీ కొన్ని విజువల్స్ లీక్ అయ్యాయి. ఇలాంటివి జరగకుండా, ఇంకా కఠినతరంగా వ్యవహరించాలి. అప్పుడు మాత్రమే ఈ లీక్స్‌ని ఎదుర్కొగలం’’ అని నాని చెప్పుకొచ్చారు.

Also Read- Singer Sunitha: సింగర్ సునీత మనసు దోచుకున్న హీరో ఎవరో తెలుసా? తెలిస్తే షాకవుతారు

నిజమే మరి, రాజమౌళి సినిమా అంటే కోట్లలో ఖర్చు పెడతారు. ప్రేక్షకులకు థియేటర్లలో థ్రిల్ ఇచ్చే సీన్లను ముందే లీక్ (SSMB29 Leaks) చేస్తే, అది సినిమాపై ఎటువంటి ప్రభావం చూపిస్తుందో, ఆ లీక్ చేసేవాళ్లు అర్థం చేసుకోవాలి. అయినా ఉపాధి కల్పించిన చోట, ఇలాంటి పనులు చేయడానికి వారికి మనసెలా వస్తుందో. లీక్స్ చేసిన వాళ్లు పలానా అని తెలిస్తే, వారిని వెళ్లగొడతారు. ఏ సినిమాకు అవకాశం ఇవ్వరు. ఒక్కసారి ముద్ర పడిందంటే, కెరీర్ ఖతం. ఎన్నో ఆలోచనలతో వచ్చి, ఇలాంటి పనులు చేయడం ఏంటి? అని ఒక్కసారైనా ఆలోచించారా? అంటూ నాని ఇంటర్వ్యూ తర్వాత నెటిజన్లు కూడా ఈ లీక్స్‌పై కామెంట్స్ చేస్తుండటం విశేషం. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ‘SSMB29’ తదుపరి షెడ్యూల్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను జక్కన్న చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..