11 Died In Telangana: తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకూ అకస్మిక వర్షాలతో సేద తీరిన రాష్ట్ర ప్రజలు.. ప్రస్తుతం మండుటెండల ధాటికి అల్లాడి పోతున్నారు. బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకి రాని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఈ క్రమంలో నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత సైతం నమోదైంది. దీన్ని బట్టి రాష్ట్రంలో ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.
Also Read: Kalima In Islam: కల్మా పేరుతో ఉగ్రవాదుల ఊచకోత.. ఇంతకీ అది ఏం చెబుతుందో తెలుసా?
అయితే గడిచిన 24 గంటల్లో ఎండ తీవ్రతకు 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో ముగ్గురు, పెద్దపల్లి జిల్లాలో ఒకరు, ఆసిఫాబాద్ జిల్లాలో ఒక్కరు, సూర్యాపేట జిల్లాలో ఒక్కరు, నిర్మల్ జిల్లాలో ఒక్కరు, కరీంనగర్ జిల్లాలో ఒక్కరు, వరంగల్ జిల్లాలో ఒక్కరు, జనగామ జిల్లాలో ఒక్కరు, ములుగు జిల్లాలో ఒక్కరు ఎండ తీవ్రతను తట్టుకోలేక చనిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. వడదెబ్బ మృతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి వివరాలు రావాల్సి ఉంది.