Southern DPGs Meeting (IMAGE CREDIT: SETCHA REPORTER:)
తెలంగాణ

Southern DPGs Meeting: సైబర్ నేరాల నివారణ కోసం.. దక్షిణాది రాష్ట్రాల డీజీపీలు ప్రత్యేక సమావేశం!

Southern DPGs Meeting: నానాటికి పెరిగిపోతున్న సైబర్​ నేరాలకు చెక్​ పెట్టేందుకు సమిష్టి చర్యలు తీసుకోవాలని దక్షిణాది రాష్ట్రాల డీజీపీలు నిర్ణయించారు. దీంట్లో భాగంగా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవటంతోపాటు ఆయా బ్యాంకులు, టెలికాం సంస్థలతో సమన్వయాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిశ్చయించారు. డీజీపీ కార్యాలయంలో  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, కర్ణాటక, తమిళనాడు, కేరళ, అండమాన్​ నికోబార్​ దీవులు, పుదుచ్చేరీల డజీపీల కో ఆర్డినేషన్​ మీటింగ్​ జరిగింది.

 Also Read; National Award to Telangana: అవార్డు విజేత మాల్ పంచాయతీ.. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రశంసలు!

ఇందులో భాగంగా వేర్వేరు రకాలుగా జరుగుతున్న సైబర్ మోసాలపై విస్తృతస్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరముందని అధికారులు అభిప్రాయపడ్డారు. సైబర్​ నేరాల బాధితులకు సత్వర న్యాయం అందించటానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. క్రిప్టో కరెన్సీ నేరాలను తగ్గించటానికి చేపట్టాల్సిన చర్యలపై కూడా చర్చించారు.

సమావేశానికి డీజీపీ జితేందర్​ అధ్యక్షత వహించగా సీఐడీ డీజీ షిఖా గోయల్​, ఆయా రాష్ట్రాలకు చెందిన అధికారులు రాజేశ్​ కుమార్​, సందీప్​ మిట్టల్​, వెంకటేశ్​, రవికృష్ణ, మనోజ్​ కే.మీనా, అనూప్​ శెట్టి, చైతన్య, హర్షవర్ధన్​, దేవేందర్​ తదితరులు వర్చువల్​ గా పాల్గొన్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?