తెలంగాణ: KTR Kavitha: బీఆర్ఎస్ సభ కోసం పోటాపోటీగా జనసమీకరణ చేస్తున్నారు. కవిత ఒకవైపు, కేటీఆర్ మరోవైపు ఇద్దరు సభ సక్సెస్ పై ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సన్నాహాక సమావేశాలతో దూసుకెళ్తున్నారు. ఒకరికంటే మరొకరు ఎక్కువ జనసమీకరణ చేసి సత్తాచాటాలని భావిస్తున్నారు. ప్రభుత్వంపై ఇరువురు విమర్శలు చేస్తూ కేడర్ లోనూ జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. గులాబీ పార్టీలో ఆ ఇద్దరు కీలకనేతలు. కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, సిరిసిల్ల ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కవిత ఎమ్మెల్సీ గా ఉన్నారు. పార్టీ 25 ఏళ్లు ప్రస్తావనాన్ని పురస్కరించుకొని ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో రజతోత్సవ సభను నిర్వహిస్తుంది.
ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సభను విజయవంతం చేసి ప్రజలంతా బీఆర్ఎస్ వెన్నంటి ఉన్నారని చెప్పడంతో పాటు కేడర్ లోనూ నూతనోత్తేజం తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తుంది. అందుబాగంగానే ఒకవైపు కేటీఆర్, మరోవైపు కవిత రాష్ట్రంలో పర్యటనలకు శ్రీకారం చుట్టారు. సన్నాహక సమావేశాలతో కేడర్ ను సన్నద్ధం చేస్తున్నారు. దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రజలను ఎలా తరలించాలనే అంశాలపై సూచనలు చేస్తున్నారు.
సన్నాహకంతో కేటీఆర్ బిజీ
కేటీఆర్ నియోజకవర్గాల్లో సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు. ఇంకోవైపు పార్టీలో చేరికలు ఇలా అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. కేడర్ ను సభను సన్నద్ధం చేస్తున్నారు. నేతలతోనూ, కేడర్ తోనూ సమావేశాలతో బిజీబిజీ అయ్యారు. రాష్ట్రంలో ఏ వర్గ ప్రజలకు కష్టమొచ్చినా తెలంగాణ భవన్‌కు వస్తున్నారని.. జనతా గ్యారేజీ మాదిరిగా ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ బీఆర్‌ఎస్ అని వ్యాఖ్యానిస్తున్నారు.
రాష్ట్ర ప్రజలందరూ గులాబీ జెండాకు జై కొడుతున్నారని చెప్పారు. కేసీఆర్‌ను చూడాలె ఆయన మాట వినాలని ప్రజలు ఉర్రూతలు ఊగుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ప్రజలు ఇక కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితి లేదని కేడర్ కు వివరిస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడొద్దని,పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు.
కవిత జిల్లాల పర్యటనలు
పార్టీ రజతోత్సవ సభ గడువు దగ్గర పడుతున్న కొద్ది ఎమ్మెల్సీ కవిత స్పీడ్ పెంచారు. వరుసగా జిల్లాల పర్యటనలు చేస్తూ పార్టీ కేడర్ తో సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొన్న నిజామాబాద్ జిల్లా, నిన్న ఖమ్మం, తాజాగా పెద్దపల్లి జిల్లా పర్యటన చేస్తూ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారారు. ప్రభుత్వం పై ఒకవైపు విమర్శలు, మరోవైపు తాను అండగా ఉంటానని కేడర్ కు భరోసా ఇస్తున్నారు. ఏ కష్టం వచ్చినా తనను కలువ వచ్చని హామీ ఇస్తున్నారు.
Also Read: Harley Davidson Tariffs: భారతీయులకు ట్రంప్ గిఫ్ట్.. తక్కువ ధరకే ఖరీదైన బైక్స్.. భలే ఛాన్స్ లే!
ప్రభుత్వ పనితీరు సరిగ్గాలేకపోవడంతో ప్రజలంతా అసంతృప్తితో ఉన్నారన్నారు. బీఆర్ఎస్ కు రోజురోజుకు ఆదరణ పెరుగుతుందని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కవిత దూకుడు ఇప్పుడు పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ విస్తృతంగా చర్చజరుగుతుంది.
పోటాపోటీగా జనసమీకరణ
సభతో నాయకుల పనితీరు స్పష్టం కానుంది. పార్టీ అధికారంలో లేకపోవడంతో కేడర్ తో పాటు నేతల్లోనూ నైరాశ్యం ఉంది. అయితే ఈ సభతో జోష్ తీసుకురావాలంటే సభకు జనసమీకరణ కీలకం. ఎవరైతే ఎక్కువ జనాన్ని తరలించి పార్టీ అధినేత కేసీఆర్ దృష్టిలో పడాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే కేటీఆర్, కవిత సైతం ఎక్కువ జనసమీకరణపై దృష్టిసారించారు. కేటీఆర్ పార్టీ నేతలకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు.
కవిత సైతం ఒకవైపు పార్టీ కేడర్, మరోవైపు జాగృతి, ఫూలే ఫ్రంట్ నేతలకు సూచనలు చేశారు. ఇంకోవైపు మహిళల తరలింపు సైతం కవిత చేపడుతున్నట్లు సమాచారం. ఇద్దరు సైతం జనం తరలింపుపైనే ఫోకస్ పెట్టడంతో ఎవరు ఎక్కువ మందిని తరలిస్తారు? నేతగా ఎవరు ఎస్టాబ్లిష్ చేసుకుంటారనేది ఇప్పుటు హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టేసేందుకు ఇద్దరు పోటాపోటీ పడుతున్నారు. భవిష్యత్ నేతగా ఈ సభతో నిరూపించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.
కేసీఆర్ పై ఆసక్తి
పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటివరకు మీడియా ముందుకు వచ్చి సభ గురించి ప్రస్తావించలేదు. కేవలం ఫాం హౌజ్ వేదికా ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించారు. మహిళా నేతలతోనూ భేటీ అయ్యారు. సభ సక్సెస్ పై దిశానిర్దేశం చేశారు. కానీ పార్టీని స్థాపించిన వ్యక్తిగా మీడియా ముందుకు వచ్చి పార్టీ ప్రస్తావనను చెప్పలేదు. మరోవైపు పార్టీలో ముగ్గురు కీలక నేతలు ఉండగా అందులో ఒక నేత సైలెంట్ గా ఉన్నారు. దానిపైనా కేసీఆర్ మౌనంగా ఉన్నారు.
ఇంతకు పార్టీలో ఏం జరుగుతుంది? అసలు ఎవరిని పార్టీలో భవిష్యత్ నేతగా చేయబోతున్నారనేదానిపైనా సస్పెన్స్ నెలకొంది. మరోవైపు కేసీఆర్ సభలో ఏం మాట్లాడబోతున్నారు? ప్రజలకు, పార్టీ కేడర్ కు ఎలాంటి సందేశం ఇస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైనప్పటికీ సభకు భారీగా ప్రజలను తరలించి సత్తాచాటేందుకు నేతలు సైతం సన్నద్ధమవుతున్నారు.
Also Read: Ponnam Prabhakar on Attack: కేంద్రానికి ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది.. మంత్రి పొన్నం