Sunkishala Project (imagecredit:swetcha)
తెలంగాణ

Sunkishala Project: ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన.. ఎండీ అశోక్ రెడ్డి

Sunkishala Project: నాగార్జున సాగర్ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సందర్శించారు. జలమండలి ఉన్నతాధికారులతో కలిసి ప్రాజెక్టు పనులను ఆయన సందర్శించి పైప్ లైన్ విస్తరణ పనులు మరియు సుంకిశాల ఇంటేక్ వెల్ నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రాజెక్టు పైపు లైన్ పనుల్ని ఎండీ పరిశీలించారు. పైపు విస్తరణ పనులలో ప్రత్యేక దృష్టి సారించాలని ఏజెన్సీ అధికారులకు సూచించారు. నాణ్యత లో నిర్లక్ష్యం వహించకూడదు అన్నారు.

ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ..

ప్రస్తుతం సివిల్, టన్నెల్, ఎలక్ట్రికల్, పైపు లైన్ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. వీటిలో టన్నెల్, ఎలక్ట్రికల్ పనులు తుది దశకు చేరుకున్నాయని సివిల్ వర్క్స్ ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రిటైనింగ్ వాల్ శిధిలాల తొలగింపు పనులు శరవేగంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

అనంతరం ఎండీ అశోక్ రెడ్డి..

సుంకిశాల టన్నెల్ గేట్ రిటైనింగ్ వాల్ ఓ పక్కకు ఒరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. శిథిలాల తొలగింపు పురోగతిని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. సిమెంట్ శిధిలాల తొలగింపు పనులలో వేగం పెంచమని అధికారులను ఆదేశించారు. అలాగే పునర్ నిర్మాణం సంబంధించిన డిజైన్ లు వెంటనే సమర్పించాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులతో అన్నారు. సైడ్ వాల్ పునర్నిర్మాణం పనులు టైం లైన్లు నిర్దేశించుకుని పనులను పురోగతిని సమీక్షించుకుంటూ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

శిథిలాలను తొలగించడానికి పంపు రూమ్ పై ఉపరితలంలో ప్రత్యేకంగా రోప్ వే ని నిర్మాణం చేస్తున్నామని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్రేన్ల ద్వారా సిమెంట్ శిధిలాలను వేగంగా తొలగింపు చేస్తామని ఈ సందర్భంగా ఎండీకి నిర్మాణ సంస్థ ప్రతినిధులతో తెలిపారు. అనంతరం పంప్ రూమ్ వైపు ఉన్న మిడిల్ టన్నెల్ పనులు పరిశీలించారు. వర్షాలు రాకముందే బండ్ నిర్మాణం, టన్నెల్ ప్లగ్గింగ్ పనులు పూర్తి చేయాలని, అందుకు రెండు షిఫ్టుల్లో పనులను చేపట్టాలని అధికారులకు సూచించారు.

Also Read: AP Heatwave: మండుతున్న ఏపీ.. ముందుందట అసలు సెగ..

అలాగే ప్రతి ఇంటేక్ టన్నెల్ వద్ద రిజర్వాయర్ వైపు గేట్లను ఏర్పాటు చేయమని చెప్పారు. తద్వారా రిటైనింగ్ వాల్ పై వత్తిడి తగ్గించుకోవడానికి అవకాశం ఉందని అన్నారు. గేట్ తో పాటు స్క్రీన్లను ఏర్పాటు చేయాలని, దానివల్ల వర్షా కాలంలో వరద సమయంలో చెట్లు ఇతర వస్తువులు కొట్టుకొని వచ్చే అవకాశాలు ఉంటాయని, ఈ స్క్రీన్ల తో వాటిని అడ్డుకోవచ్చని వివరించారు.

నాగార్జున సాగర్:

సాధారణంగా నాగార్జున సాగర్ రిజర్వాయర్ లో డెడ్ స్టోరేజీలో 131 టీఎంసీలు, 510 అడుగుల నీరు ఉన్నంత వరకు వాడుకునే వెసులుబాటు ఉంటుంది. వేసవిలోనూ తాగునీటి ఎద్దడి రాకుండా ఉండేందుకు ప్రభుత్వం సుంకిశాల ఇంటేక్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. నాగార్జున సాగర్ లో జలాలు డెడ్ స్టోరేజికి పడిపోయినా ఈ ప్రాజెక్టు ద్వారా నగరానికి తాగునీరు అందించవచ్చు.

Also Read: స్వేచ్ఛ E పేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

Just In

01

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!