Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నియోజకవర్గమైన పిఠాపురం (Pithapuram Assembly constituency)లో గత కొన్ని రోజులుగా ఏదోక వివాదం చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. అక్కడి టీడీపీ ముఖ్యనేత ఎస్వీఎస్ఎన్ వర్మ (SVSN Varma)కు, జనసేన పార్టీ (Janasena Party)కి మధ్య విభేదాలు తలెత్తినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇటీవల నాగబాబు (MLC Nagababu) పర్యటన సందర్భంగా.. వర్మ అనుచరులు చేసిన హంగామా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పిఠాపురం వేదికగా కూటమి బంధానికి బీటలు వాలాయన్న ప్రచారం జరిగింది. ఈ వివాదం తర్వాత తొలిసారి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటనకు వెళ్లబోతున్నారు. దీంతో వర్మ అనుచరుల రియాక్షన్ ఎలా ఉంటుందోనని ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
25న పవన్ పర్యటన
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ నెల 25న పిఠాపురంలో పర్యటించనున్నారు. ఈ మేరకు పర్యటనను జనసేన పార్టీ ధ్రువీకరించింది. ఈ పర్యటన సందర్భంగా నియోజక వర్గంలో పలు అభివృద్ధి పనులకు పవన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ పాల్గొననున్న ఇతర కార్యక్రమాలకు అనువైన ప్రదేశాలను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పరిశీలించారు. అక్కడ కావాల్సిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.
నాగబాబు బ్యాక్.. పవన్ ఎంట్రీ
పిఠాపురంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి సంబంధించి ఇటీవలే నాగబాబు నియోజకవర్గంలో పర్యటించారు. అయితే ఆ పర్యటనలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నాగబాబు అభివృద్ధి పనులను ప్రారంభిస్తుండగా.. వర్మ అనుచరులు ‘జై టీడీపీ.. జైజై వర్మ’ అంటూ నినాదాలు చేశారు. ఇందుకు పోటీగా జనసేన కార్యకర్తలు సైతం ప్రతి స్పందించడంతో అది రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈసారి పవన్ నేరుగా పిఠాపురంలో అడుగుపెట్టబోతున్నారు. ఆయనే స్వయంగా అభివృద్ధి పనులు ప్రారంభించబోతున్నారు.
అందరి దృష్టి వర్మపైనే!
ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన సందర్భంగా చాలా అగ్రెసివ్ గా స్పందించిన వర్మ అనుచరులు.. పవన్ రాక సందర్భంగా ఎలా రియాక్ట్ అవుతారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ ను వర్మ దూరంగా పెడుతున్నారన్న భావన అతడి అనుచరుల్లో బలంగా నాటుకు పోయిందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నాగబాబు తరహాలో పవన్ కు సైతం వర్మ తన అనుచరుల ద్వారా అడ్డు తగులుతారా? పవన్ తో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని సర్దుకుపోతారా? అన్నది తెలియాల్సి ఉంది.
Also Read: Harley Davidson Tariffs: భారతీయులకు ట్రంప్ గిఫ్ట్.. తక్కువ ధరకే ఖరీదైన బైక్స్.. భలే ఛాన్స్ లే!
వర్మకు సపోర్ట్ గా వైసీపీ?
ఎస్.వీ.ఎస్.ఎన్. వర్మకు అటు టీడీపీలో గానీ.. ఇటు జనసేనలో గానీ సముచిత స్థానం దక్కడం లేదని ఆయన అనుచరులు కోపంతో ఉన్నారు. ఈ క్రమంలోనే వర్మ.. త్వరలో వైసీపీలో చేరతారన్న ప్రచారం గత కొన్ని రోజులుగా జరుగుతోంది. వైసీపీ సోషల్ మీడియా (YCP Social Media).. వర్మ రాకపై సానుకూలంగా స్పందిస్తోంది. వర్మ పార్టీలో చేరితో పిఠాపురం వైసీపీ బాధ్యతలు వర్మకేనని పేర్కొంటున్నాయి. అయితే ఇన్ని రోజుల నుంచి దీనిపై చర్చ జరుగుతున్నప్పటికీ వర్మ వర్గం ఒక్కసారి కూడా ఖండించలేదు. దీంతో వైసీపీలోకి ఆయన వెళ్లడం ఖాయమేనన్న సందేహాలు ఏపీ రాజకీయాల్లో వ్యక్తమవుతున్నాయి.