Lady Aghori: తెలుగు రాష్ట్రాల్లో వివాదాల మయంగా మారిన అఘోరీకి తాజాగా ఊహించని పరిణామం ఎదురైంది. చీటింగ్ కేసులో అఘోరీని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police).. ఆనంతరం ఆమెను సంగారెడ్డి సబ్ జైలు (కంది జైలు)కు తరలించారు. ఈ క్రమంలో అఘోరీకి జైలు అధికారులు షాక్ ఇచ్చారు. ఆడ, మగ తేలకుండా ఏ బ్యారక్ లో ఉంచలేమని తేల్చి చెప్పారు. అనంతరం ఆమెను అక్కడి నుంచి పంపించేశారు.
జైలులో ఉంచేందుకు నిరాకర
పూజల పేరుతో లేడీ అఘోరీ (Lady Aghori) తనను మోసం చేసిందని హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. యూపీ, మధ్య ప్రదేశ్ సరిహద్దుల్లో అఘోరీని అరెస్ట్ చేసి ఇవాళ నగరానికి తీసుకొచ్చారు. అనంతరం చేవెళ్ల కోర్ట్ కు (Chevella Court) తరలించగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ (Aghori Remand) విధించింది. దీంతో ఆమెను సంగారెడ్డి సబ్ జైలు (Sangareddy Sub Jail)కు తరలించగా.. జైలులో ఉంచేందుకు అక్కడి అధికారులు నిరాకరించారు. లింగ నిర్ధారణ జరిగితే గాని ఇక్కడ ఉంచుకోలేమంటూ తెగేసి చెప్పారు.
చంచల్ గూడకు అఘోరీ!
అయితే అఘోరీ వ్యవహారం మరోమారు న్యాయమూర్తి వద్దకు వెళ్లే ఛాన్స్ ఉంది. జడ్జి సూచన మేరకు అఘోరీకి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం లింగ నిర్ధారణ చేసి ఆమెను చంచల్ గూడ జైలుకు తలరించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. చంచల్ గూడ జైలులో ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేకించి ఒక బ్లాక్ ఉండటంతో.. అందులో అఘోరీని ఉంచే అవకాశముంది.
Also Read: Local body MLC elections: హైదరాబాద్ ఎలక్షన్స్ లో బిగ్ ట్విస్ట్.. బీజేపీ అభ్యర్థికి కాంగ్రెస్ ఓట్లు..?
కేకలతో హంగామా
అంతకుముందు సంగారెడ్డి సబ్ జైలు వద్ద అఘోరీ హల్ చల్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల పెళ్లి చేసుకున్న శ్రీవర్షిణి (Sri Varshini) ని తనతో పాటే ఉంచాలంటూ పట్టుబట్టింది. ఈ క్రమంలో అరుపులు, కేకలు వేస్తూ జైలు వద్ద హంగామా సృష్టించింది. అంతకుముందు నార్సింగి పోలీసు స్టేషన్ (Narsingi Police Station) ఎదుట మీడియాతో మాట్లాడిన అఘోరీ.. శ్రీవర్షిణిని కూడా తనతోనే ఉంటుందంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే తనతోపాటు జైలులోకి అనుమతి ఇవ్వాలని లేడీ అఘోరీ గొడవ చేయడం గమనార్హం.