AIDS Treatment At ART centers: రాష్ట్రంలో దాదాపు 1.24 లక్షల మంది ఎయిడ్స్ బారిన పడ్డారని, వీరంతా ఏ ఆర్ టీ సెంటర్ల ద్వారా ఉచితంగా ట్రీట్మెంట్ అందజేస్తున్నామని వైద్యశాఖ ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఎయిడ్స్ పరిస్థితిపై హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా రివ్యూ నిర్వహించారు. అనంతరం ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు ఓ ప్రత్యేక ప్రకటనను రిలీజ్ చేసింది.
2024–2025 సంవత్సరంలో 19.02 లక్షల మందికి హెచ్ ఐవీ టెస్టులు చేయగా, 9415 మందికి పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో 5 వేల కంటే ఎక్కువ మంది పేషెంట్లు ఉన్నారని, మరో 13 జిల్లాల్లో 2 నుంచి 5 వేల లోపు పేషెంట్లు ఉన్నారని పేర్కొన్నారు.
Also read: BRS Kavitha: ఖమ్మంపై కవిత ఫోకస్.. పెద్ద ప్లానే అంటూ టాక్?
హెచ్ ఐవీ పరీక్షలు, చికిత్స, నియంత్రణ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నట్లు స్పష్టం చేశారు. ఎన్ జీవోల సహకారంతో ఎయిడ్స్ నియంత్రణకు కృషి చేస్తున్నట్లు వివరించారు. అయితే 2030 నాటికి ఎయిడ్స్ ను పూర్తిగా నియంత్రించాలని మంత్రి టార్గెట్ ఇచ్చినట్లు బోర్డు ప్రకటించింది.