Mahesh Babu ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Mahesh Babu: హీరో మహేష్ బాబుకు బిగ్ షాక్.. నెక్స్ట్ లిస్ట్ పెద్దదేనా? ఈడీ వెరీ స్పీడ్ బాస్..

Mahesh Babu: తెలుగు స్టార్ హీరో మహేష్ బాబుకు పెద్ద షాక్ తగిలింది. ఎవరూ ఊహించలేని విధంగా ఈడీ నోటీసులు పంపించడంతో ఇండీస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సురానా డెవలపర్స్, సాయిసూర్య డెవలపర్స్ కేసులో నెల 27న విచారణకు హాజరుకావాలంటూ అధికారులు ఆదేశించారు. ఈడీ రైడ్స్ లో వీటికి సంబందించిన ఆధారాలను సేకరించారు.ఈ కంపెనీల నుంచి యాడ్స్ చేసేందుకు రూ.5.9 కోట్లు రెమ్యునరేషన్ ముట్టినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. వాటిలో రూ.2.5 కోట్లను అక్రమంగా తీసుకున్నట్టు ఈడీ అధికారులకు ఆధారాలు దొరికాయి.

Also Read:  Ponguleti Srinivas Reddy: ప్రభుత్వ ఆలోచనల అనుగుణంగా ప‌నిచేయాలి.. మంత్రి పొంగులేటి

మహేష్ బాబు చేసిన యాడ్స్ ను చూసి, ఈ సంస్థలో అక్రమాలు జరుగుతున్నాయని తెలియక ఎంతోమంది పెట్టుబడులు పెట్టారని ఈడీ అధికారులు వెల్లడించారు. అదే విధంగా కంపెనీ యాజమాన్యం కొనుగోలుదారులను మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. క్రమంలోనే మనీలాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోమవారం ఏప్రిల్ 27న నటుడు మహేష్ బాబ విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు.

Also Read:   KPHB Murder Mystery: కేపీహెచ్‌బీ హత్య కేసులో మిస్టరీ ఛేదించిన పోలీసులు.. భార్య, మరదలు, తోడల్లుని అరెస్ట్!

దీనిపై రియాక్ట్ అయిన ఫ్యాన్స్ వామ్మో ఇది నిజమేనా.. మేము ఇది నమ్మలేకపోతున్నాం.. మహేష్ అన్న ఇలా చేశాడా అంటూ షాక్ లో ఉండిపోయారు. ఇంకొందరైతే యాడ్స్ ను చూసి పెట్టుబడులు పెట్టడం కరెక్ట్ కాదంటూ రియల్ ఎస్టేట్ వారిపై  ఫైర్ అవుతున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?